కాంగ్రెస్‌లోనే ఎందుకు చేరుతున్నామంటే?: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు క్లారిటీ
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీలో చేరనున్న సీనియర్ రాజకీయ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం ఈ ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని ప్రజలు కేసీఆర్‌ను గెలిపించారని.. కానీ, ప్రజల ఆకాంక్షలను ఆయన నెరవేర్చలేదని విమర్శించారు.
మాటల గారడీలో సీఎం కేసీఆర్ సిద్ధహస్తుడని, అలాంటి వ్యక్తిని గద్దె దించాలని గట్టి పార్టీతో ప్రయాణించాలని నిర్ణయించుకుని కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పొంగులేటి చెప్పారు. కేసీఆర్ స్కీంల పేరుతో మాయ చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎలా వ్యవహరిస్తుందో చూస్తూనే ఉన్నామన్నారు. నీళ్లు, నిధులు, నియామక హామీలు నెరవేర్చలేదని కేసీఆర్ సర్కారుపై మండిపడ్డారు.

పదవులు, డబ్బులు ఒక్కటే నాయకులకు ముఖ్యం కాదని.. పదవుల కంటే ఆత్మగౌరవం ముఖ్యమని పొంగులేటి అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిందన్నారు. కొంతకాలంగా తాను, జూపల్లి అనేక చోట్ల ఆత్మీయ సభలు నిర్వహించామన్నారు. ఒక దశలో ప్రాంతీయ పార్టీ పెట్టాలని భావించామన్నారు. ప్రాంతీయ పార్టీ పెట్టడంపై అభిప్రాయ సేకరణ చేశామని.. కొత్త పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని భావించామని తెలిపారు. అందుకే పార్టీ పెట్టలేదని చెప్పారు.
ప్రాంతీయ పార్టీ పెట్టడం కంటే కాంగ్రెస్ పార్టీలో చేరడం మంచిదని మేధావులు సూచించారని పొంగులేటి తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ గ్రాఫ్ పెంచిందన్నారు. కర్ణాటకలో విజయంతో కాంగ్రెస్ మరింత పుంజుకుందన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ పరిస్తితి రోజురోజుకూ దిగజారుతోందన్నారు.
అన్ని పరిణామాలను బేరీజు వేసుకుని బీజేపీలో కాకుండా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెండుసార్లు కేసీఆర్‌కు అవకాశమిచ్చారని.. మరోసారి ఇస్తే మరింత దారుణ పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలను కోరారు. జులై 2న ఖమ్మంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు పొంగులేటి తెలిపారు. ఆ ఖమ్మం సభకు ఎన్ని లక్షల మంది వస్తారో లెక్కలేసుకోండంటూ బీఆర్ఎస్ నేతలకు పొంగులేటి సవాల్ విసిరారు.
#WATCH | Former MP Ponguleti Srinivas Reddy and former Telangana minister Jupally Krishna Rao and other BRS leaders join Congress in the presence of party president Mallikarjun Kharge and Rahul Gandhi at the AICC headquarters in Delhi. pic.twitter.com/cTYdenDhdj
— ANI (@ANI) June 26, 2023
మరోవైపు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తమ ప్రాణాలు త్యాగాలు చేశారని.. తాము తమ పదవులను వదిలి ఉద్యమంలో పాల్గొన్నామన్నారు. తెలంగాణ వచ్చాక తమ అంచనాలన్నీ తప్పాయన్నారు. కేసీఆర్ పాలన అంతా బోగస్ మాటలు, పథకాలతో సాగుతోందని విమర్శించారు. ఎప్పటికప్పుడు కొత్త స్కీంలతో జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. ప్రశ్నించే గొంతకే ఉండొద్దని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. కేసీఆర్ తీరు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించేలా ఉందని మండిపడ్డారు.
Former Telangana minister & five time MLA Shri Jupally Krishna Rao, former MP Shri Ponguleti Srinivasa Reddy,
— INC TV (@INC_Television) June 26, 2023
& many Telangana leaders met Congress President Shri Mallikarjun Kharge, former Congress President Shri Rahul Gandhi, AICC General Secy (Org) Shri KC Venugopal, AICC… pic.twitter.com/uZD0w6Pb74
దేశంలో ఎన్నడూ లేనంతగా ప్రచారానికి డబ్బులు ఖర్చుపెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ నియంతృత్వ దోరణి పరాకష్టకు చేరిందని మండిపడ్డారు జూపల్లి. మంత్రలను కూడా కేసీఆర్ మనుషులుగా చూడలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వకపోతే దేవుడు కూడా క్షమించడన్నారు. తమకు నష్టం వాటిల్లుతుందని తెలిసినా.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వెంట నడవాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీలో చేరుతున్నట్లు జూపల్లి కృష్ణారావు తెలిపారు. కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రావద్దని అన్నారు.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications