భవనం కూలిన ఘటన, మంత్రి కుటుంబసభ్యులను కూడా వదలం
నానక్ రామ్ గూడ లో భవనం కూలిన ఘటనలో మంత్రి కుటుంబ సభ్యులు నిందితులని తేలితే ఉపేక్షించబోమని రాష్ట్ర తెలంగాణ శాఖ మంత్రి కెటిఆర్ చెప్పారు.
హైదరాబాద్ :నానక్ రామ్ గూడలో భవనం కూలిన ఘటనలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఈ ఘటనలో ఎంతటివారున్నా ఉపేక్షించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంఘటన స్థలాన్ని రాష్ట్ర మున్సిఫల్ శాఖ మంత్రి కెటిఆర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు సందర్శించారు. ఈ ఘటనలో మంత్రి కుటుంబసభ్యులు నిందితులని తేలితే వదిలేది లేదన్నారు కెటిఆర్.
మంత్రి కుటుంబ సభ్యులను వదిలేయం
నానక్ రామ్ గూడలో భవనం కూలిపోయిన ఘటనలో సహయక చర్యలను మంత్రి కెటిఆర్ శుక్రవారం నాడు పర్యవేక్షించారు. ఈ భవన యజమానికి ఓ మంత్రికి అతి సన్నిహితంగా ఉండేవాడని మీడియాలో వార్తలు రావడంతో , ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు మంత్రి వద్ద ప్రస్తావించారు. ఈ ఘటనలో నిందితులని తేలితే మంత్రి కుటుంబసభ్యులను కూడ వదిలే ప్రసక్తే లేదన్నారు కెటిఆర్.భవన యజమానిని అరెస్టు చేస్తామన్నారు మున్సిఫల్ శాఖ మంత్రి.

ఈ ఘటనలో చనిపోయినవారికి 10 లక్షలు, క్షతగాత్రులకు లక్ష రూపాయలను పరిహరంగా చెల్లించనున్నట్టు మంత్రి ప్రకటించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారించిన డిప్యూటీ కమీషనర్ ను, ఎసిపి ని విధుల నుండి తప్పించినట్టు మంత్రి చెప్పారు.వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు చెప్పారు.భవన యజమాని ప్రస్తుతం పరారీలో ఉన్నాడని మంత్రి చెప్పారు.సత్యనారాయణసింగ్ కుటుంబంలో ఒకరిని అదుపులోకి తీసుకొన్నామని చెప్పారు మంత్రి.
గ్రామకంఠంలో నిర్మాణాలకు ఎలా అనుమతిచ్చారని ఆయన ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తోందని చెప్పారు. ఈ మేరకు కొత్తగా చట్టాన్ని తీసుకు వస్తున్నామన్నారు. మరో వైపు అక్రమ నిర్మాణాలను కూల్చివేసే చర్యలను ప్రారంభించినట్టు మంత్రి చెప్పారు.
Deeply anguished at the loss of life in building collapse in Nanakramguda. Stationed here at the site monitoring relief & rescue operations
— KTR (@KTRTRS) December 9, 2016
Suspended town planning ACP &GHMC Deputy Commissioner, announced exgratia 10 lakhs to deceased & setup special police team to arrest builder
— KTR (@KTRTRS) December 9, 2016
-
Kavitha: తెలంగాణలో కవితకు పెరుగుతున్న క్రేజ్..కేటీఆర్‌ను దాటేస్తోందా..? -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications