‘‘ఎవరెన్ని యాత్రలు చేసినా ప్రజలే న్యాయ నిర్ణేతలు’’

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ యాత్ర పట్ల తమకేమీ అభ్యంతరం లేదని, ఎవరెన్ని యాత్రలు చేసినా ప్రజలే న్యాయ నిర్ణేతలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.

వరంగల్ : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ యాత్ర పట్ల తమకేమీ అభ్యంతరం లేదని, ఎవరెన్ని యాత్రలు చేసినా ప్రజలే న్యాయ నిర్ణేతలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.

మంగళవారం నుంచి ప్రజాచైతన్య యాత్రలు చేపడుతున్నామని, ఫిబ్రవరి 9న ఆదిలాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నామని లక్ష్మణ్ పేర్కొన్నారు. రైతు వ్యతిరేక నిర్ణయాలపై రైతు పోరుయాత్రలు చేపడతామని, దళిత అదాలత్‌లు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

bjp-lakshman

అంతేకాదు, సమ్మక్క- సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని కోరినట్లు లక్ష్మణ్ చెప్పారు. మేడారం ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మారబోతోందని, జాతరకు కేంద్ర మంత్రులు, ప్రముఖులు వస్తారని లక్ష్మణ్ పేర్కొన్నారు.

కానీ సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని ఆయన విమర్శించారు. జాతరలో ప్రత్యేక శిబిరాల ద్వారా భక్తులకు సేవలు అందిస్తామని లక్ష్మణ్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+