సుధాకర్ లేనప్పుడు.. వాళ్లింట్లోనే స్వాతితో: కొత్త కారులోను షికారు.. విచారణలో రాజేష్..
హైదరాబాద్: నాగర్ కర్నూల్ క్రషర్ వ్యాపారి సుధాకర్ రెడ్డి హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినీ ఫక్కీలో భర్తనే కడతేర్చిన ఈ ఉదంతం చాలామందిని నివ్వెరపోయేలా చేసింది.
Recommended Video

ప్రేమించిన భర్తను, కడుపున పుట్టిన పిల్లలను దూరంగా పెట్టి తన సుఖాల కోసం స్వాతి తాపత్రయ పడింది. ఈ క్రమంలో పెడదారి పట్టిన ఆమె.. వివాహేతర సంబంధాన్ని కొనసాగించడమే కాకుండా.. భర్త స్థానంలో మరొకరిని ప్రవేశపెట్టాలని చూసింది. చివరకు ఎట్టకేలకు నిజం బయటపడటంతో సమాజం ముందు దోషిగా తలవంచుకోక తప్పలేదు.

సుధాకర్ లేనప్పుడు:
గురువారం నాగర్ కర్నూల్ పోలీసులు రాజేష్ ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ నుంచి తరలించారు. ఈ సందర్భంగా రాజేష్ మీడియా ప్రశ్నలకు బదులిచ్చాడు. సుధాకర్‌రెడ్డి లేనప్పుడు వాళ్లింట్లోనే కలుసుకునేవాళ్లమని తెలిపాడు. సుధాకర్ రెడ్డితో స్వాతి వైవాహిక జీవితం సరిగా లేదని, ఆ క్రమంలోనే తాను ఆమెకు దగ్గరయ్యానని చెప్పుకొచ్చాడు.

కారులో షికారు:
భర్తకు తెలియకుండా స్వాతి రాజేష్ తో చాలానే వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. సుధాకర్ రెడ్డి కొత్త కారు కొంటే.. ప్రియుడితో కలిసి స్వాతి అందులో షికారు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా రాజేషే చెప్పాడు. కొత్తకారు తెచ్చాం.. రమ్మంటే మహబూబ్‌నగర్ కూడా వెళ్లొచ్చామని మీడియా ముందు తెలిపాడు.

చేతులకు కట్లు:
రాజేష్ ఆరోగ్యంగానే ఉన్నాడంటూ అపోలో డీఆర్‌డీఏ వైద్యులు చెప్పడంతో అతన్ని అరెస్టు చేసేందుకు నాగర్‌కర్నూల్ పోలీసులు గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. 25 శాతం కాలిన గాయాలున్నాయని, చేతులకు గాలి తగలకూడదని అక్కడి వరకూ కట్లు వేసినట్లు తెలిపారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి నాగర్ కర్నూల్ తరలించారు.
ఇదిలా ఉంటే, రాజేష్ చికిత్సకు రూ.3.45 లక్షలు కాగా రూ.1.88 లక్షలు స్వాతి కుటుంబం, రాజేష్ కుటుంబం చెల్లించింది. అసలు విషయం తెలిశాక వారంతా వెళ్లిపోవడంతో.. ఆ డబ్బు ఎవరు కడుతారన్నది తేలలేదు. దీంతో రాజేష్ ను డిశ్చార్జ్ చేసేందుకు వారు ఒప్పుకోలేదు. అయితే పోలీసులు కేసు గురించి చెప్పి రాజేష్‌ను నాగర్‌కర్నూల్‌కు తరలించారు.

పోలీసులు ఏమన్నారు?:
సుధాకర్ రెడ్డిపై తనకెప్పుడూ ద్వేషం లేదని రాజేష్ చెప్పడం గమనార్హం. అటు పోలీసులు కూడా ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వాతే అని చెబుతున్నారు. కొల్లాపూర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications