తెలంగాణలో కూడా బుల్డోజర్ తో తొక్కిస్తాం.!టీఆర్ఎస్ కు అసలైన మొగుడు బండి సంజయ్ అన్న రాజాసింగ్.!

నారాయణపేట/హైదరాబాద్ : హిందూత్వ కోట.. నారాయణపేట అన్నారు బీజేపి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. మహా సంగ్రామ యాత్రలో బాగంగా బీజేపి అద్యక్షుడు బండి సంజయ్ కు సంఘీభావం ప్రకటించేందుకు రాజాసింగ్ నారాయణ పేట సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అధికార గులాబీ ప్రభుత్వంపైన ఆగ్రహం వ్యక్తం చేసారు రాజాసింగ్. బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించారని, ఇది ఎవ్వరూ ఊహించలేదన్నారు రాజాసింగ్. బండి సంజయ్ పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా, ప్రజల నుండి ఘన స్వాగతం లభిస్తుందని తెలిపారు.

తెలంగాణ ప్రజల రక్తం తాగుతున్నారు..

తెలంగాణ ప్రజల రక్తం తాగుతున్నారు..

గులాబీ నేతలు తెలంగాణ ప్రజల రక్తం తాగుతున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అసలైన మొగుడు మా బండి సంజయ్ అని రాజాసింగ్ పేర్కొన్నారు. తాగుబోతు గులాబీ మంత్రులు బండి సంజయ్ పాదయాత్రకు ప్రజలు రావడం లేదని అంటున్నారని, ఆ తాగుబోతు మంత్రులు నారాయణపేట వస్తే తెలుస్తుందన్నారు రాజాసింగ్.

ఇక్కడున్న చిన్న పిల్లలకు రాజకీయాలు తెలియకపోవచ్చు, కాకపోతే బండి సంజయ్ అంటే ఏంటో వాళ్ళకి తెలుసన్నారు రాజాసింగ్. బండి సంజయ్ ను చూస్తేనే చిన్న పిల్లలు, యువత బాగా సంతోష పడుతున్నారని, నారాయణపేట ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రాజాసింగ్ స్పష్టం చేసారు.

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..

ఊట్కూరు, నారాయణపేటలో హిందువులపై ఎన్ని హత్యాచారాలు జరిగాయో యావత్ తెలంగాణ ప్రజలందరికి తెలుసున్నారు రాజాసింగ్. హిందూ కార్యకర్తలపై ఎన్ని కేసులు పెడుతున్నారో చూస్తున్నామని, ఇప్పుడు గులాబీ నాయకుల టైమ్ నడుస్తోందని, వచ్చేది మాత్రం బీజేపి ప్రభుత్వం అనే అంశం గుర్తుంచుకోవాలని రాజాసింగ్ హెచ్చరించారు. వచ్చేది ఖచ్చితంగా కాషాయ ప్రభుత్వమేనని, బండి సంజయ్ యావత్ తెలంగాణలో పర్యటిస్తున్నారని, మార్పు తధ్యమన్నారు రాజాసింగ్.

 కేటీఆర్ మోదీతో పెట్టుకున్నారు..

కేటీఆర్ మోదీతో పెట్టుకున్నారు..

ఈ తాగుబోతు ప్రభుత్వం ఇప్పుడే వెళ్ళిపోతే బాగుంటుంది అని ప్రజలు అనుకుంటున్నారని, మంత్రి కేటీఆర్ ఒక చిన్న పిల్లోడని, ప్రధాని మోడీతో పెట్టుకుంటే ఎలా ఉంటాదో తెలుసుకోవాలని చురకలంటించారు రాజాసింగ్. మోడీతో పెట్టుకున్న వాళ్ళ గతి ఏంటో దేశం మొత్తం తెలుసని, తర్వాత కేటీఆర్ కు కూడా అదే గతి పడుతుందన్నారు రాజాసింగ్. నారాయణపేట లో ఇసుక మాఫియా పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సూటిగా ప్రశ్నించారు రాజాసింగ్.

అవసరం అనుకుంటే తెలంగాణలో కూడా బుల్డోజర్లను దింపుతాం..

అవసరం అనుకుంటే తెలంగాణలో కూడా బుల్డోజర్లను దింపుతాం..

బండి సంజయ్ పాదయాత్రలో ముందడుగు వేస్తే తన వెనుక ఉంటామన్నారు రాజాసింగ్. సంజయ్ ఒక వ్యక్తి కాదని, ఒక అద్భుత శక్తి అని, హిందువులకు ఓ దీపం లాంటి వాడు సంజయ్ అని ప్రశంసించారు. ఎంఐఎం కి భయపడి ఒక మతానికే టీఆర్ఎస్ పని చేస్తోందని, యూపీ లో యోగి ఎలా బుల్డోజర్ తో శత్రువులను తరిమికొడుతున్నారో, తెలంగాణలో కూడా అమిత్ షా అండతో, బండి సంజయ్ త్వరలోనే బుల్డోజర్ ల వాడకానికి పని చెప్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో చూపిస్తామన్నారు రాజాసింగ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+