వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేదోడి సొంతింటి కల నెరవేర్చి తీరుతాం.!మరోసారి స్పష్టం చేసిన ఎమ్మెల్సీ ‌కవిత.!

|
Google Oneindia TeluguNews

జగిత్యాల/హైదరాబాద్ : ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో సారి స్పష్టం చేసారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపెల్లి వద్ద నిర్మిస్తున్న 4520 డబుల్ బెడ్ రూం ఇండ్లను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరిశీలించారు. ఈ‌ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, జగిత్యాల ప్రజలు జిల్లా కావాలని దశాబ్దాలుగా కోరుకున్నారని, ఆ కలను సీఎం చంద్రశేకర్ రావు నెరవేర్చారని కవితి ఉద్ఘాటించారు. ఇచ్చిన ప్రతి హామీని చంద్రశేకర్ రావు అమలు చేస్తున్నారని కవిత తెలిపారు.

జగిత్యాలలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పరిశీలన.. పేదోడి కల నెరవేర్చుతామన్న కవిత..

జగిత్యాలలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పరిశీలన.. పేదోడి కల నెరవేర్చుతామన్న కవిత..

రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత జగిత్యాలలోనే ఒకేచోట పెద్ద సంఖ్యలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని,‌ నిర్మాణ పనులు సైతం వేగవంతంగా జరుగుతున్నాయని ఎమ్మెల్సీ ‌కవిత అన్నారు. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇండ్ల నిర్మాణ పనులు త్వరిగతిన పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గతంలో గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇండ్లకు, టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిస్తున్న ఇండ్లకు చాలా తేడా ఉందని, ఇక్కడి ఇంటి నిర్మాణలు చూస్తే సీఎం చంద్రశేఖర్ రావు సంతోష పడతారని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

కవిత చెప్తే కరెక్ట్.. జగిత్యాలలో సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి కోసం ప్రయత్నిస్తానన్న ఎమ్మెల్సీ..

కవిత చెప్తే కరెక్ట్.. జగిత్యాలలో సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి కోసం ప్రయత్నిస్తానన్న ఎమ్మెల్సీ..

వచ్చే సంవత్సరం జూన్ లో గా ఇంటి నిర్మాణలు పూర్తి చేసి పేదవారి సొంతింటి కలను నెరవేరుస్తామని తెలిపారు. జగిత్యాల అభివృద్దికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్న ఎమ్మెల్సీ కవిత, సీఎం చంద్రశేఖర్ రావు ఇచ్చిన మాట ప్రకారం జగిత్యాల జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేశారన్నారు.‌ అంతేకాదు జగిత్యాలలో సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి కోసం సీఎంతో మాట్లాడుతాని ఎమ్మెల్సీ ‌కవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డా.సంజయ్ కుమార్, సుంకె రవిశంకర్, జిల్లా కలెక్టర్ రవినాయక్, మునిసిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి పాల్గొన్నారు.

సుమన్ కు ఓదార్సు.. విప్ బాల్క సుమన్ ను పరామర్శించిన కవిత

సుమన్ కు ఓదార్సు.. విప్ బాల్క సుమన్ ను పరామర్శించిన కవిత

అనంతరం రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బాల్క సుమన్ తండ్రి, TRS పార్టీ సీనియర్ నాయకులు, మెట్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ బాల్క సురేష్ అనారోగ్యంతో స్వర్గస్తులైయ్యారు. ఈ రోజు ఎమ్మెల్సీ ‌కవిత, MLA బాల్క సుమన్ స్వగ్రామం రేగుంటలో స్వర్గీయ సురేష్ చిత్ర పటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లా రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్యే వివేక్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్, జీహెచ్ఎంసీ కార్పోరేటర్ బాబా ఫసియుద్దిన్ పాల్గొన్నారు.

జగదీష్ రెడ్డి పరామర్శ.. బాల్కసుమన్ కు మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శ..

జగదీష్ రెడ్డి పరామర్శ.. బాల్కసుమన్ కు మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శ..

పితృ వియోగం చెందిన చెన్నూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ ను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం పరామర్శించారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్,తుంగతుర్తి శాసన సభ్యులు గాధరి కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మెట్ పల్లి పట్టణ సమీపంలోనీ రేణిగుంటలో బాల్కా సుమన్ ఇంటికి చేరుకున్న మంత్రి జగదీష్ రెడ్డి బాల్క సుమన్ తండ్రి మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బాల్క సురేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తో పాటు కుటుంబ సభ్యులను మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు.

English summary
MLC Kavitha once again made it clear that the goal of the state government is to fulfill the dream of own home for every poor person. MLC Kavitha examined the 4520 double bedroom houses being constructed at Nookapelli, Malyala Zone, Jagittala District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X