చంద్రగ్రహణం తొలగిపోయింది.. మహిళలకు సీఎం రేవంత్ వరాలు

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తెలంగాణలో చంద్ర గ్రహణం తొలగిపోయిందని గత బీఆర్ఎస్ పాలననుద్దేశించి వ్యాఖ్యానించారు.

ఏ మార్పు కావాలని ఆడబిడ్డలు ఆశీర్వదించారో ఆ మార్పు ఇప్పుడు పరేడ్ గ్రౌండ్‌లో కనిపిస్తోందన్నారు సీఎం రేవంత్. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే రాష్ట్రం 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవుతుందని కేబినెట్ సమావేశంలో నిర్ణయించామన్నారు. ఆడబిడ్డలు తలచుకుంటే వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధన పెద్ద కష్టమేమీ కాదని రేవంత్ వ్యాఖ్యానించారు.

We will make one crore women millionaires CM Revanth Reddy at Mahila Shakti Sabha

65 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని సీఎం రేవంత్ తెలిపారు. పాఠశాలల నిర్వహణ, బడి పిల్లలకు కోటి 30 లక్షల జతల యూనిఫాం కుట్టించే పని మహిళలకే అప్పగించామన్నారు. జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు కేటాయించామని తెలిపారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి మహిళా సంఘాలకు ఇచ్చామన్నారు.

అంతేగాక, ఆర్టీసీలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులకు యజమానులుగా మహిళలు అవుతున్నారని సీఎం రేవంత్ చెప్పారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం సీతక్క, కొండా సురేఖ పనిచేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని.. ఇవాళ సీతక్క, సురేఖ మంత్రులు అయ్యారని తెలిపారు. 33 శాతం మహిళలు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అవుతారన్నారు.

మహిళల్లో నైపుణ్యం ఉన్న వారిని ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి గెలిపిస్తామన్నారు సీఎం రేవంత్. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలని సోనియా గాంధీ కృషి చేశారని సీఎం రేవంత్ తెలిపారు. ఇందిరను అమ్మా అన్నారు.. ఎన్టీఆర్‌ను అన్నా అన్నారు.. నన్ను రేవంత్ అన్న అంటున్నారని చెప్పుకొచ్చారు. మీతో పేగుబంధం కలిగిన మీ అన్నగా మాట ఇస్తున్నా.. మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తా అని మహిళలకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రసంగం అనంతరం 28 లక్షల సభ్యులకు రూ. 23 వేల కోట్ల చెక్కును సీఎం రేవంత్ అందజేశారు.

స్వశక్తి ఉత్పత్తులు పరిశీలించిన సీఎం రేవంత్

రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాలు స్వశక్తితో తయారు చేస్తున్న అనేక రకాల ఉత్పత్తులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షుణ్ణంగా పరిశీలించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి సందర్శించారు. ఆయా ఉత్పత్తులను పరిశీలిస్తూ ముఖ్యమంత్రి సంఘాల ప్రతినిధులతో మాట్లాడి వాటి తయారు చేసే విధానంతో పాటు ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మహిళలకు బస్సులు అప్పగించిన సీఎం రేవంత్

స్వయం సహాయక సంఘాలకు అప్పగించిన 'ఇందిరా మహిళా శక్తి' బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాలకు తొలి విడతగా 150 బస్సులను అప్పగించి, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే ఈ వినూత్న కార్యక్రమాన్ని "ప్రపంచ మహిళా దినోత్సవం" రోజున శ్రీకారం చుట్టారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రజా ప్రతినిధులు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+