తెలంగాణకు వెదర్ అలర్ట్: ఈ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి నాసిక్, నిజామాబాద్, సుకుమా, విజయనగరం, ఇస్లాంపూర్ వరకు ఉన్నాయని విస్తరించాయని తెలిపింది. సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
రాష్ట్రంలో రాగల మూడు రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్నాయని వెల్లడించింది. సోమవారం క్రింది స్థాయిలోని గాలులు పశ్చిమ, నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని ప్రకటించింది.

జూన్ 10న నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్గాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ భారీ వర్షాలతోపాటు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది.
జూన్ 11న నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్గాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ వర్షాలతోపాటు ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
జూన్ 12న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల పల్లి, ములుగు, భద్రాద్రి కొత్త గూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబాబాద్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ క్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.












Click it and Unblock the Notifications