Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో మరో 3 రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్: రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు చాలా జిల్లాల్లో బీభత్సాన్ని సృష్టించాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వందల సంఖ్యలో పశువులు, పది మందికిపైగా మనుషులు భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం వర్షం కాస్త తెరినివ్వడంతో సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేశారు. వరదల్లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహార పదార్థాలను అందజేస్తున్నారు.

మరోవైపు, వాతావరణ శాఖ తాజాగా మూడు రోజులకు వాతావరణ సూచనలు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Weather news

శనివారం, ఆదివారం కొన్ని చోట్ల తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం దక్షిణ ఒడిశా పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద ఉన్న అల్పపీడనం శుక్రవారం బలహీన పడిందని వాతావరణ కేంద్రం వివరించింది. షియర్ జోన్ 18°ఎన్ అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని తెలిపింది.

శుక్రవారం దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, మరో అల్పపీడనం ఏర్పడితే తప్ప.. ఇప్పట్లో భారీ వర్షాలు కూడా లేవని వాతావరణ కేంద్రం డైరెక్టర్​ నాగరత్న తెలిపారు. వర్షాలు కొద్ది రోజులపాటు ఎడతెరిపినిచ్చే అవకాశం ఉందని చెప్పారు.

కాగా, ఇప్పటికే కురిసన భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాల కారణంగా చాలా గ్రామాలు జలదిగ్భంధంలో ఉన్నాయి. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం మొత్తం వరదనీటిలో మునిగిపోయింది.
పది మందికిపైగా వరద నీటిలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. వందలాది పశువులు వరదల్లో కొట్టుకుపోయి, వరదనీటిలో మునిగి చనిపోయాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+