rain: తెలంగాణలో మూడు రోజులపాటు వానలు, ఈ జిల్లాల్లో భారీ వర్షాల అలర్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఎండ తీవ్రత నుంచి కొంత ఉపశమనం లభించనుంది. ఎందుకంటే, వచ్చే మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది.

సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం వైపు దిగువస్థాయిలో గాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆవర్తనాల ప్రభావంతో రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు, భారీ వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

weather news: next three days rain in telangana districts

సెప్టెంబర్‌ 2, 3,4 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, కొమరం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు మూడు రోజులు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

శుక్రవారం నుంచి మూడు రోజులపాటు మాత్రం ఉరుములుమెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. ఈ రోజుల్లో ఉదయం పూట పొగమంచు ఉంటుందని.. సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది.

కాగా, ఆగస్టు నెలలో హైదరాబాద్ తోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే, సెప్టెంబర్ నెలలో మాత్రం వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వర్షాకాల సీజన్లోనే వర్షాలు తక్కువగా ఉన్నాయని.. మొత్తంగా చూసుకుంటే సాధారణ వర్షపాతమే నమోదైందని పేర్కొంది. అయితే, సెప్టెంబర్ నెలలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+