తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు: ఉరుములు, మెరుపులతో జల్లులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం నాటి తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలలో ఉన్న ఆవర్తనం.. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి సౌరాష్ట్ర వరకు ఉన్న ద్రోణి మంగళవారం బలహీనపడ్డాయి.
మంగళవారం ముఖ్యంగా కిందిస్థాయి గాలులు నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలోనికి వస్తున్నాయి. మంగళవారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒకటి, రెండు ప్రదేశాల్లో బుధవారం కొన్ని ప్రదేశాలలో, ఎల్లుండి చాలా ప్రదేశాల్లో వచ్చే అవకాశాలున్నాయి.

బుధవారం, గురువారం భారీ వర్షాలు తెలంగాణలోని నైరుతి, తూర్పు జిల్లాల్లో ఒకటి, రెండు ప్రదేశాల్లో కురుస్తాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి రెండు ప్రదేశాల్లో చాలా జిల్లాల్లో వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
కాగా, నైరుతి రుతుపవనాల ప్రభావంతో జులై రెండో వారం నుంచి దేశ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. మిగితా ప్రాంతమంతా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications