Rain: అల్పపీడనం: తెలంగాణలోని ఈ జిల్లాల్లో 3 రోజులు వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ కురిసింది. మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, కరీంనగర్ జిల్లాల్లో చెదురుమదురు జల్లులు కురిశాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గురువారం కూడా ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఆగస్టు 25 నుంచి 28 వరకు మూడు రోజులపాటు చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపింది.

అయితే, ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 2 మధ్య విరామం అనంతరం సెప్టెంబర్ 3 తర్వాత రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, బుధవారం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉక్కపోత వాతావరణం కొనసాగింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మరోవైపు, అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.












Click it and Unblock the Notifications