హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Weather: తెలంగాణలో మరో మూడు రోజులపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇదే వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి రెండు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తాజా ప్రకటనలో పేర్కొంది. ఉపరితల ద్రోణి మహారాష్ట్రలోని మరఠ్వాడ నుంచి ఉత్తర ఇంటీరియర్ తమిళనాడు వరకు కొనసాగింది. గురువారం మరఠ్వాడ నుంచి ఇటీరియర్ కర్ణాటక మీదుగా ఇటీరియర్ తమిళనాడు కొనసాగుతోంది. సగటున సముద్ర మట్టం నుంచి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుంది.

 Weather: Next three days rains in few places in telangana

ఈ క్రమంలో రానున్న మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, రాష్ట్రంలోని చాలా చోట్ల పొడి వాతావరణం, ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదయ్యే అవకాశాలున్నాయి.

కాగా, మార్చి ప్రారంభం నుంచే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు, దేశంలోనూ అనేక రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి.

English summary
Weather: Next three days rains in few places in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X