weather alert: మరో రెండ్రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం హైదరాబాద్ పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయం వాయుగుండంగా బలపడిందిన, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది బాలాసోర్‌కి తూర్పు ఆగ్నేయ దిశగా 250 కిలోమీటర్ల సాగర్ దీవులకు ఆగ్నేయ దిశగా 150 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.

weather: next two days moderate to heavy rain in Telangana districts

అల్పపీడనం క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రానున్న 6 గంటల్లో మరింత బలపడీ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ పశ్చిమబెంగాల్, ఒడిశా తీరాల్లోని బాలాసోర్, సాగర్ ద్వీపం మధ్యన శుక్రవారం తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది.

తీవ్ర అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. కాగా, శుక్రవారం మధ్యాహ్నం తర్వాత నుంచి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+