హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Rain: తెలంగాణలో మోస్తరు వర్షాలు, హైదరాబాద్‌లో రెండురోజులపాటు జోరు వానలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం కూడా హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ జార్ఖండ్ ను ఆనుకుని ఉత్తర ఒడిశా మీదుగా కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు.

Weather: Normal to moderate rains in Hyderabad and other telangana districts

ఈ అల్పపీడనం జార్ఖండ్ ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కదులుతూ ఉత్తర మధ్యప్రదేశ్ వైపునకు వెళ్తూ క్రమంగా బలహీనపడుతుందని వెల్లడించారు. మరోవైపు, మరో రెండు మూడు రోజులపాటు హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములుమెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

రాజధాని నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. కాగా, శుక్రవారం సాయంత్ర నుంచి పలు ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.

English summary
Weather: Normal to moderate rains in Hyderabad and other telangana districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X