రానున్న నాలుగు గంటలూ కుండపోతే - ఈ ప్రాంతాలకు తీవ్ర హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రుతుపవనాలు తిరుగు ముఖం పట్టాయి. ఫలితం గ ఉత్తరాంధ్రతో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్ జారీ చేసింది. ఇప్పుడు బిగ్ అలర్ట్ ఇచ్చారు. రానున్న నాలుగు గంటల్లో ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల తో పాటుగా హైదరాబాద్ నగరంలోనూ కుండపోత వర్షం కురవనున్నట్లు వెల్లడించారు. అర్ద్రరాత్రి వరకు హైదరాబాద్ నగరాన్ని వర్షం మంచెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వాతావరణ నిపుణులు తాజా అలర్ట్ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో మరి కాసేపట్లో భారీ వర్షం ప్రారంభం కానుంది. అర్ద్రరాత్రి వరకు వర్షం కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా మబ్బులు కమ్ముకున్నాయి. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి నాళాలో కొట్టుకొని పోయి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ జామ్ లేకుండా ముందస్తు చర్యలు ప్రారంభించారు. అర్ద్రరాత్రి వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ హెచ్చరించారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అదే విధంగా బుధవారం తెల్లవారుజామున కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంతో పాటు మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో కూడా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అలర్ట్స్ జారీ అయ్యాయి. రాత్రంతా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాత్రికి భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications