Weather alert: హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన వడగాలులు

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే సూర్యుడి భగభగలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట తిరగాలంటేనే జనం బయపడిపోతున్నారు. తాజాగా, వాతావారణ శాఖ తెలంగాణ ప్రజలకు వడగాలుల హెచ్చరిక జారీ చేసింది.

శుక్ర, శనివారాల్లో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్​‌లోనూ తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 42-43°C దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండు రోజులు ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 సమయంలో ప్రజలు బయటకు రావద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Weather update next two days heat waves in telangana

వడగాల్పుల తీవ్రత ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఏప్రిల్ 7 తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది.

మార్చి నెల నుంచే తెలంగాణలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక, ఏప్రిల్ మొదటి వారంలోనూ తెలంగాణలోని చాలా జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం గమనార్హం. బయట తిరిగేవారు టోపీలు, చేతిరుమాళ్లు తలలకు చుట్టుకుని కనిపిస్తున్నారు. జ్యూస్, కూల్ డ్రింక్స్ అమ్మకాలు భారీగా పెరిగాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు ఈ విధంగా ఉంటే.. ముందు ముందు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కాగా, 2016 తర్వాత ఈ ఏడాది అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు అధికంగా ఉంటున్నాయని చెప్పారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేడి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు. వృద్దులు, పిల్లలు ఈ సమయంలో బయటకు రావొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+