తెలంగాణ వ్యాప్తంగా నేడు, రేపు భారీ వర్షాలు: జులై రెండో వారం నుంచి విస్తారంగా వానలు

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా, తెలంగాణపై 2.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఏర్పడింది. రుతుపవనాలు బలహీనంగా కదులుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం, మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు 90 ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా వెల్దండ(నగర్‌కర్నూల్ జిల్లా)లో 4.8 సెంటిమీటర్ల వర్షపాతం, వెలిజాల(రంగారెడ్డి)లో 3.8 సెంటిమీటర్లు, చలకుర్తి(నల్గొండ)లో 3.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం సత్యనారాయణపురం(భద్రాద్రికొత్తగూడెం జిల్లా) 38.7 డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది.

 Weather update: Next two days heavy rains in Telangana state

కాగా, గత కొద్దిరోజులుగా మందగించిన నైరుతి రుతుపవనాలు జులై 8 నుంచి తిరిగి చురుగ్గా మారే అవకాశం ఉందని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజీవన్ తెలిపారు. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉన్న వాతావరణ వ్యవస్థ ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు చెప్పారు.

Recommended Video

    Why Couples Are Separated In Ashada Masam? Scientific Facts | Oneindia Telugu

    దక్షిణాది రాష్ట్రాలతోపాటు దేశంలోని పశ్చిమతీరం, తూర్పు మధ్య ప్రాంతాల్లో వర్షాలు విస్తరంగా కురుస్తాయన్నారు. మొత్తంగా జులైలో దేశ వ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగానే నమోదు కానుంది. ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+