weather update: హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజులపాటు వర్షాలు

హైదరాబాద్: నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తుండగా.. రాగల మూడు రోజులపాటు ఈ వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోకి పశ్చిమ, నైరుతి నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. గురు, శుక్రవారాల్లో తేటికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని, శనివారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

మూడు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. కాగా, గురువారం ఉదయం 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా కోటగిరిలో 141 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. అలాగే రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్‌, హనుమకొండ, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో అక్కక్కడ భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైందని టీఎస్‌ డీపీఎస్‌ తెలిపింది.

 weather update: three more days heavy rain in hyderabad and telangana district

మరోవైపు, గురువారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుసింది. నగరాన్ని నల్లని మేఘాలు కమ్మేశాయి. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురవగా.. మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. భారీ వర్షం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. మరోవైపు రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు జాగ్రత్త వహించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Recommended Video

    Weather Update : మరో అల్పపీడనం ముప్పు.. AP & Telangana లో విస్తారంగా వర్షాలు..! || Oneindia Telugu

    ఎల్బీనగర్, నాగోల్, వనస్దలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్, పెద్ద అంబర్ పెట్, అబ్దుల్లా పుర్ మెంట్ పరిధిలలో భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడింది. ఉదయం నుంచి ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే, సాయంత్రానికి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావడంతో పాటు భారీ వర్షం మొదలైంది. వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం నాడు మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో కూడా భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, హిమాయత్ నగర్, నారాయణగూడ, అంబర్‌పేట, నాంపల్లి, లక్డీకపూల్, పంజాగుట్ట, దిల్‌సుఖ్ నగర్, కోఠీ తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+