శ్రీజ పెళ్లి వార్తలు: చిరంజీవితో చర్చించేందుకే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చారా?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయిదు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. ఆయన సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్‌ను క్యాన్సిల్ చేసుకొని ఆ రోజున వచ్చారు. కాపు గర్జన నేపథ్యంలో జరిగిన తుని ఘటన పైన మాట్లాడేందుకే ఆయన హైదరాబాద్ వచ్చారని అందరూ భావించారు.
అయితే పవన్ కళ్యాణ్ ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని రావడం వెనుక మరో కారణం కూడా ఉందని తెలుస్తోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతను ప్రధానంగా తన అన్నయ్య చిరంజీవి రెండో కూతురు శ్రీజ పెళ్లి విషయమై చర్చించేందుకు వచ్చారని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.

2007లో శ్రీజ శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆమె ఓ బిడ్డకు తల్లి. శ్రీజ లండన్‌లోని కోవెంట్రీ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. ఆమెకు ఎన్నారై బిజినెస్‌మాన్‌తో పెళ్లి జరగనుందని రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి.
అతను చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ కుటుంబంలోని యువకుడు అని వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వివాహం ఖరారైందని, మార్చి నెలలో వివాహం జరగవచ్చునని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ వివాహ చర్చల నిమిత్తమే పవన్ కళ్యాణ్ వచ్చారని అంటున్నారు. అయితే, ఈ వార్తలను చిరంజీవి కుటుంబం నిర్ధారించవలసి ఉంది.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications