పెళ్లి మండపంలో వధువు ప్రియుడి హంగామా: చితక్కొట్టారు, పెళ్లి రద్దు

వివాహ వేదిక సిద్ధంగా ఉంది. ఇక కొద్ది సేపట్లో వివాహం జరుగుతుందనగా వధువు ప్రియుడు పెళ్లి మండపంలోకి వచ్చి నానా హంగామా చేశాడు. దీంతో ఆ పెళ్లి రద్దయిపోయింది.

జగిత్యాల: వివాహ వేదిక సిద్ధంగా ఉంది. ఇక కొద్ది సేపట్లో వివాహం జరుగుతుందనగా వధువు ప్రియుడు పెళ్లి మండపంలోకి వచ్చి నానా హంగామా చేశాడు. దీంతో ఆ పెళ్లి రద్దయిపోయింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా మోరపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది.

ఆ వివరాల్లోకి వెళితే.. మోరపల్లికి చెందిన యువకుడికి మల్యాల మండలం ఒగులాపూర్‌ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. శుక్రవారం మోరపల్లిలో వివాహ వేడుకకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు.

Wedding cancelled due to bride's lover

మరో గంటలో పెళ్లి జరగాల్సి ఉండగా గోదావరిఖనికి చెందిన యూస్‌ఫ్‌ అనే యువకుడు పెళ్లిలో రంగం ప్రవేశం చేశాడు. వధువును ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నానని చెబుతూ తన సెల్‌ఫోన్‌లో తీసుకున్న ఫొటోలను వరుడికి చూపించాడు. దీంతో అక్కడే ఉన్న వరుడి కుటుంబ సభ్యులు యూసుఫ్‌ను చెట్టుకు కట్టేసి చితకబాదారు.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు యూసుఫ్‌ను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై వధువు సైతం ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని చెప్పడంతో పెళ్లిని ఇరుకుటుంబాలు ఇష్టపూర్వకంగా రద్దు చేసుకున్నారు. అప్పటి వరకు భారీగా పెళ్లి ఏర్పాట్లు చేసిన కుటుంబ సభ్యులు పెళ్లి వేదికతోపాటు, పెళ్లి సామగ్రిని వెంటనే ఇంటి వద్ద నుంచి తొలగించారు.

కాగా, ఇరు కుటుంబ సభ్యులు ఇష్టపూర్వకంగా పెళ్లిని రద్దు చేసుకున్నారని పోలీసులు తెలిపారు. యూసుఫ్‌ ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిపోయాడని, ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+