వైభవోపేతంగా కలెక్టర్ ఆమ్రపాలి వెడ్డింగ్ రిసెప్షన్

వరంగల్: ఇటీవల వివాహం చేసుకున్న వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి పెళ్లి రిసెప్షన్ శుక్రవారం ఘనంగా జరిగింది. వరంగల్‌లోని కలెక్టర్ క్యాంప్ ఆఫీస్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ వేడుకకు రాజకీయ నేతలు, జిల్లా అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. వేదికపై నూతన వధూవరులు దంపతులు దండలు మార్చుకోగా... అతిథులు శుభాకాంక్షలు తెలిపి... ఆశీర్వదించారు.

వైభవోపేతంగా రిసెప్షన్...

వైభవోపేతంగా రిసెప్షన్...

వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి వెడ్డింగ్ రిసెప్షన్ శుక్రవారం వరంగల్‌లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైభవోపేతంగా జరిగింది. ఈ నెల 18న జమ్ముకశ్మీర్‌లో ఢిల్లీకి చెందిన ఐపీఎస్‌ అధికారి సమీర్‌శర్మతో ఆమె వివాహం జరిగిన విషయం తెలిసిందే. వివాహానంతరం గురువారం ఆమ్రపాలి దంపతులు వరంగల్ విచ్చేశారు.

భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు...

భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు...

శుక్రవారం ఉదయం కలెక్టర్ ఆమ్రపాలి దంపతులు తమ కుటుంబ సభ్యులతోపాటు నగరంలోని భద్రకాళి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమ్రపాలి, ఆమె భర్త సమీర్ శర్మ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ప్రముఖులు, రాజకీయనాయకులు హాజరు...

ప్రముఖులు, రాజకీయనాయకులు హాజరు...

శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన వివాహ విందు వేడుకకు జిల్లాలోని అధికారులు, ప్రముఖులు, రాజకీయ నాయకుల హాజరయ్యారు. వేదికపై ఆమ్రపాలి దంపతులు దండలు మార్చుకోగా.. అతిథులు ఒక్కొక్కరుగా వెళ్లి వారిని ఆశీర్వదించారు.

అతిథులకు సాదర ఆహ్వానం...

అతిథులకు సాదర ఆహ్వానం...

కలెక్టర్ ఆమ్రపాలి వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన అతిథులకు ఆమె తల్లిదండ్రులు పద్మావతి, వెంకటరెడ్డి సాదరంగా ఆహ్వానం పలికారు. వేడుకను పురస్కరించుకుని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయాన్ని సహజ సిద్ధంగా ప్రకృతిని మరిపించేలా అలంకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+