25 రోజుల్లో 52 లక్షల పెళ్లిళ్లు..రూ.7.5 లక్షల కోట్ల వ్యాపారం..!!

పెళ్లంటేనే సందడి..ఆ సందడితో పాటు బంగారం,బట్టలు,నగలు,ఫర్నిచర్,వాహనాలు,క్యాటరింగ్,హోటళ్లకు కాసుల వర్షం.ఒక పెళ్లి వెనుక పదుల సంఖ్యలో వ్యాపారాలు,వందలాది మంది ఉపాధి ఆధారపడి ఉంటారు.ఇప్పుడు అలాంటి పెళ్లిళ్ల సీజన్ దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతమివ్వనుంది.నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15 వరకు కేవలం 25 రోజుల్లో దేశవ్యాప్తంగా సుమారు 52 లక్షల వివాహాలు జరగనున్నాయి.వీటి ద్వారా ఏకంగా రూ.7.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది.ముఖ్యంగా హైదరాబాద్ సహా తెలంగాణలోనూ శుభముహూర్తాలు ప్రారంభం కావడంతో వ్యాపార వర్గాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ పరిశోధనా విభాగం 25 రాష్ట్రాల్లోని 300 మందికి పైగా వ్యాపార ప్రముఖులు,550కి పైగా వర్తక సంఘాల ప్రతినిధులతో విస్తృత సంప్రదింపులు జరిపి ఈ నివేదికను రూపొందించింది.ఈ పెళ్లిళ్ల సీజన్‌లో దేశంలో ప్రతిరోజూ సగటున 2 లక్షలకు పైగా వివాహాలు జరగనున్నాయి.ఒక్క దేశ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోనే ఏకంగా రూ.2.5 లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు నమోదయ్యే అవకాశం ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

wedding-season-bonanza-52-lakh-weddings-to-generate-7-5-lakh-crore-business-know-about-hyderabad

పెళ్లిళ్ల ఖర్చులో ఏ రంగానికి ఎంత వాటా?

CAIT అంచనాల ప్రకారం ఈ మొత్తం వ్యాపారంలో వస్తువుల కొనుగోళ్ల వాటా 54 శాతం కాగా,సేవల రంగం వాటా 46 శాతంగా ఉండనుంది.అంటే వస్తువుల విక్రయాల ద్వారా రూ.4.05 లక్షల కోట్లు, సేవల ద్వారా రూ.3.45 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది.ఇందులో ఒక్క బంగారం,ఆభరణాల కొనుగోళ్లే రూ.1.2 లక్షల కోట్లు ఉండొచ్చని అంచనా.దుస్తులు,వస్త్రాల వ్యాపారం రూ.90 వేల కోట్లకు చేరవచ్చని పేర్కొంది. క్యాటరింగ్‌కు రూ.75 వేల కోట్లు,ఫంక్షన్ హాళ్లు,హోటళ్లకు రూ.60 వేల కోట్ల వ్యాపారం వచ్చే అవకాశం ఉంది.ఈ పెళ్లిళ్ల సందడి వల్ల దేశవ్యాప్తంగా సుమారు 1.25 కోట్ల తాత్కాలిక,సీజనల్ ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడవచ్చని CAIT అంచనా వేసింది.

వివాహ కానుకలు మరియు సంబంధిత వస్తువులు రూ.37,500 కోట్లు,నిత్యావసర ఆహార సరుకుల విక్రయాలు మరో రూ.37,500 కోట్ల వ్యాపారాన్ని సాధించనున్నాయి.వీటితో పాటు ఎలక్ట్రానిక్స్, డ్రై ఫ్రూట్స్)మిఠాయిలు,ఫర్నిచర్ మరియు గృహోపకరణాల రంగాలు ఒక్కొక్కటి రూ.30,000 కోట్ల చొప్పున లబ్ధి పొందుతాయని వర్తక సమాఖ్య వివరించింది.

విభాగం అంచనా వ్యాపారం
ఆభరణాలు మరియు బంగారం రూ. 1.2 లక్షల కోట్లు
వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు రూ. 90,000 కోట్లు
కానుకలు, నిత్యావసర సరుకులు రూ. 75,000 కోట్లు
ఎలక్ట్రానిక్స్, స్వీట్లు, ఫర్నిచర్ రూ. 30,000 కోట్లు (ఒక్కో రంగానికి)

తెలంగాణలోనూ పెళ్లి బాజాలు షురూ

తెలంగాణలో చాతుర్మాసం ముగియడంతో నవంబర్ 21 నుంచి వివాహ ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 21,24,25,26 తేదీల్లో శుభకార్యాలు జరగనున్నాయి.డిసెంబర్ 2 నుంచి 6 వరకు,అలాగే 11,12 తేదీల్లోనూ పెళ్లిళ్లకు ముహూర్తాలు ఉన్నాయి.డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభం కావడంతో సంక్రాంతి వరకు వివాహాలకు విరామం ఏర్పడనుంది.హైదరాబాద్‌లోని జ్యువెలరీ షాపులు,వస్త్ర దుకాణాలు,ఫంక్షన్ హాళ్లు,క్యాటరింగ్ సంస్థలు,డెకరేషన్ వ్యాపారులు,ఫోటోగ్రాఫర్లు ఈ సీజన్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు.మొత్తంగా చూస్తే పెళ్లి ముహూర్తాలు కేవలం కుటుంబాల్లోనే కాదు..వ్యాపార రంగంలోనూ కొత్త కళ తీసుకురాబోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+