హైదరాబాద్ లో 'మినీ రాజస్థాన్'.. ఫేమస్ పిక్నిక్ స్పాట్..

హైదరాబాద్ లో వీకెండ్ టూరిజం ఊపందుకుంది. వారం మొత్తం వర్క్ లైఫ్ లో బిజీగా ఉన్న ఉద్యోగులు వారాంతంలో దగ్గర్లోని పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారు. ఉదయం వెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ కు దగ్గరలోనే రాజస్థాన్ అందాలను మైమరపించేలా ఆనంద్ గఢ్ పిక్నిక్ ఫామ్ ఇప్పుడు అందరినీ ఆకర్శిస్తోంది. నగరంలోని అనేక మంది తమ పిల్లలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో సరదాగా ఇక్కడకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఆనంద్ గఢ్ పిక్నిక్ ఫామ్ కు వెళ్తే రాజస్థాన్ కు వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. మనం హైదరాబాద్ లో ఉన్నామా..? లేక రాజస్థాన్ లో ఉన్నామా..? అనేంతలా మైమరిపింపజేస్తుంది.

హైదరాబాద్ సమీపంలోని షామీర్ పేట్ దగ్గర ఉన్న ఆనంద్ గఢ్ పిక్నిక్ ఫార్మ్.. రాజస్థానీ సంస్కృతిని, విలేజ్ అనుభవాన్ని అందించే అగ్రో-టూరిజం కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడికి అత్యధిక సంఖ్యలో ఫ్యామిలీస్ వస్తుంటారు. అలాగే ఫ్రెండ్స్, కార్పొరేట్ సంస్థల కోసం ఇక్కడ అడ్వెంచర్ గేమ్స్, సాంప్రదాయ ఆటలు, మ్యాజిక్ షోలు, రాజస్థానీ భోజన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నగర కాలుష్యానికి దూరంగా ఆహ్లాదకరంగా ఒక రోజు గడిపేందుకు ఒక మంచి ప్రదేశంగా ఆనంద్ గఢ్ పిక్నిక్ ఫార్మ్ ఉంది.

Weekend Plans One-Day Trip to Mini Rajasthan in Hyderabad

ఆనంద్ గఢ్ పిక్నిక్ ఫార్మ్ షామీర్ పేట్ సమీపంలోని కేశవరం గ్రామంలో ఉంది. ఈ ప్రాంతం హైదరాబాద్ సిటీ సెంటర్ నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణలుగా అడ్వెంచర్ అండ్ విలేజ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడకు వచ్చిన పర్యాటకులు వ్యవసాయం, కుండలు చేయడం, ట్రాక్టర్ రైడ్‌ లు, మ్యాజిక్ షో, పప్పెట్ షో, లైవ్ ఆస్ట్రాలజీ, ఫైర్ డాన్స్.. తదితర కార్యక్రమాలను ఆస్వాదించవచ్చు. అలాగే క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి అవుట్‌ డోర్ గేమ్స్.. క్యారమ్స్, స్నూకర్, లూడో వంటి ఇండోర్ గేమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

అలాగే ఆనంద్ గఢ్ పిక్నిక్ ఫార్మ్స్ లో అన్‌ లిమిటెడ్ బ్రేక్‌ ఫాస్ట్, లంచ్, హై-టీ, డిన్నర్ ప్యాకేజీని బట్టి అందుబాటులో ఉంటాయి. ఇక్కడి ప్రాంతం రాజస్థాన్ గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. నిజంగానే రాజస్థాన్ లోని గ్రామాల్లో సంచరిస్తున్నామా..? అన్న ఫీల్ కలుగుతుంది. ఇక్కడ ధరల విషయానికి వస్తే పెద్దలకు రూ. 1,250 ఒక్కొక్కరికి ఉంటుంది. అలాగే పిల్లలకు రూ. 799 ఉంటుంది. మూడు అడుగుల లోపు ఎత్తు ఉన్న పిల్లలకు ఉచితంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+