వాట్సప్ యూనివర్సిటీకి స్వాగతం; బీజేపీ టూరిస్టులు దమ్ బిర్యానీ, ఇరానీచాయ్ రుచిచూసి వెళ్ళండి: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీపై, బీజేపీపై మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను ఎద్దేవా చేస్తూ చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందమైన హైదరాబాద్ నగరంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశానికి వాట్సప్ యూనివర్సిటీ కి స్వాగతం అంటూ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బిజెపిని వాట్సప్ విశ్వవిద్యాలయం అన్న మంత్రి కేటీఆర్
బీజేపీ నిర్వహిస్తున్నది వాట్సాప్ విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి సమావేశం అని పేర్కొన్న మంత్రి కేటీఆర్ "ఝుమ్లా జీవులకు స్వాగతం అంటూ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాట్సప్ విశ్వవిద్యాలయం" అనేది మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో పుకార్లు పుట్టించడానికి, నకిలీ కంటెంట్ యొక్క సర్క్యులేషన్ కోసం ఉద్భవించిన పదం, ఈ పదాన్ని తరచుగా ప్రతిపక్ష పార్టీలు బిజెపిని తిట్టడానికి ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ కూడా బిజెపిని వాట్సప్ విశ్వవిద్యాలయం అని ఎద్దేవా చేశారు
బీజేపీ నేతలను టూరిస్ట్ లతో పోల్చిన మంత్రి కేటీఆర్
ఇక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న వారు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పాలన, నూతన పద్ధతులు మరియు పథకాలను తెలుసుకోవాలని పర్యాటక సభ్యులకు సూచిస్తున్నాం అని మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలను టూరిస్ట్ లుగా పోల్చారు. అంతేకాదు మా దమ్ బిర్యానీ మరియు ఇరానీ చాయ్ రుచిని ఆస్వాదించడం మర్చిపోవద్దు అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

తెలంగాణా బహుముఖ ప్రజ్ఞ గురించి గూగుల్ ను అడగాలన్న కేటీఆర్
ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ తెలంగాణ యొక్క బహుముఖ ప్రజ్ఞ గురించి గూగుల్ ను అడగాలి అంటూ బిజెపి నేతలకు సూచించారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ ఎక్కడ ఉంది? అంటే రెండూ తెలంగాణలో ఉండటం మరియు రెండూ కెసిఆర్ ప్రభుత్వమే నిర్మించడం చాలా గర్వకారణం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వ్యవసాయం నుండి ఐసీటీ వరకు తాము అన్ని రంగాలను కవర్ చేస్తున్నామని, అది తెలంగాణ సత్తా అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ పట్ల మొదట్నుంచీ ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని ప్రశ్నిస్తున్న టీఆర్ఎస్
ఇక ఇదే సమయంలో ప్రధాని మోదీ.. తెలంగాణ పట్ల మొదట్నుంచీ ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నదని టిఆర్ఎస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నించింది. తెలంగాణలో ఏర్పాటుచేస్తామని ప్రకటించిన తరువాత ఇతర రాష్ట్రాలకు తరలించిన సంస్థల గురించి ప్రశ్నిస్తున్నదని పోస్ట్ చేసింది. ఈ ప్రశ్నలకు మోదీ పరివారం జవాబు చెప్పాలని నిగ్గదీసి అడుగుత్నుదని వెల్లడించింది. దేశం ఇప్పుడు బై బై మోడీ అంటుందని టీఆర్ఎస్ పేర్కొంది.












Click it and Unblock the Notifications