Beluga Airbus:హైదరాబాద్ రన్‌వేను ముద్దాడిన ఆరంతస్తుల విమానం,స్పెషాలిటీస్ ఇవే..?

హైదరాబాద్: హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి వార్తల్లో నిలిచింది. అతిపెద్ద విమానం బెలుగా ఎయిర్ బస్ జూలై 31వ తేదీన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఈ విమానం చూసేందుకు చాలామంది పోటీపడ్డారు. అయితే గతేడాది డిసెంబర్‌లో కూడా ఈ భారీ విహంగం శంషాబాద్ రన్‌వేను తొలిసారిగా ముద్దాడింది. ఇంతకీ బెలుగా ఎయిర్‌బస్ ప్రత్యేకతలేంటి ఒకసారి చూద్దాం.

బెలుగా ఎయిర్ బస్.. ఆకాశపు భారీ విహంగంగా అభివర్ణించే ఈ ఎయిర్‌బస్ భారీ తిమింగలం ఆకారాన్ని పోలి ఉంటుంది.ఎయిర్‌క్రాఫ్ట్ భారీ క్యాబిన్ సాధారణ విమానం క్యాబిన్ కంటే నాలుగు రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఈ భారీ విమానం ఎక్కువగా వస్తు రవాణా కోసం వినియోగిస్తారు. ముఖ్యంగా విమానంకు చెందిన విడిభాగాలు రవాణా చేయాలంటే ఈ భారీ తిమింగలపు విహంగాన్నీ రంగంలోకి దించుతారు.

belugaairbus11

ఇది దాదాపుగా ఆరు అంతస్తుల ఎత్తుతో ఉంటుంది. వీటి రెక్కలు 45 మీటర్లు మేరా విస్తరించి ఉంటాయి. ఇక అంతర్భాగం పరిశీలిస్తే 124 అడుగుల పొడుగు, 23 అడుగుల ఎత్తు ఉంటుంది.1996 నుంచి ఈ భారీ కార్గో విమానం అందుబాటులో ఉంటూ సేవలందిస్తోంది. మరో నాలుగు బెలుగా ఎయిర్‌బస్‌లు సేవలందిస్తున్నాయి. గతేడాది డిసెంబర్‌లో తొలిసారిగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. ఆ సమయంలో 116 టన్నుల జనరేటర్‌ను బెలుగా మోసుకెళుతోంది.

belugaairbus

బెలుగాను ఎయిర్‌బస్ సంస్థ తయారు చేస్తోంది. తొలి ఫ్లయిట్‌ను 13 సెప్టెంబర్ 1994లో తయారు చేసింది. 1995లో అధికారికంగా సేవలు అందించడం ప్రారంభించింది. 2010లో ఎయిర్‌బస్ బెలుగా XL పేరుతో మరొక భారీ విమానంను తయారు చేసింది. ఎయిర్ బస్ A330-200 ఆధారంగా దీన్ని డెవలప్ చేశారు. జనవరి 2020లో ఇది తొలిసారిగా ఎగిరింది. మొత్తానికి బెలుగా హైదరాబాద్ రావడంపై జీఎంఆర్ సంస్థ, ఎయిర్‌పోర్ట్ అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+