అది మాత్రం తెలియదు!: ఆరోజు ఇవాంకా ఏం చేస్తారు?.. ఫలక్‌నుమా సమావేశంలో ఇలా..

హైదరాబాద్: దాదాపు నెల రోజుల నుంచి హైదరాబాద్ ప్రజలంతా 'ఇవాంకా' గురించే చర్చించుకుంటున్నారు. ఆమె రాక, ఆమె కోసం చేస్తున్న ఏర్పాట్లు, భద్రతా పర్యవేక్షణ గురించి పుంఖాను పుంఖాలుగా మాట్లాడుకుంటున్నారు.

జీహెచ్ఎంసీ అధికారుల హడావుడి ఏర్పాట్లు, ఉన్నపలంగా హైదరాబాద్ రూపు రేఖలను మార్చివేసిన తీరు.. ఇవన్నీ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఇవాంకా హైదరాబాద్ పర్యటనకు సంబంధించి అమెరికా అధికారులు తొలిసారిగా ఇక్కడి పోలీసులతో సమావేశమయ్యారు.

 ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సమావేశం:

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సమావేశం:

ఇవాంకా ట్రంప్ భధ్రతా సిబ్బంది శుక్రవారం వివిధ శాఖల ప్రతినిధులతో ఫలక్‌నుమా ప్యాలెస్ లో సమావేశం నిర్వహించారు. తొలుత పోలీసు అధికారులతో దాదాపు 75 నిముషాల పాటు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.

ఇవాంకా రాకవేళ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆమె అడుగుపెట్టింది మొదలు.. అక్కడి భద్రతా చర్యలు.. ఆ తర్వాత ఆమెతో పాటు ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించే అధికారుల వివరాలు, ఆమె వాహనాల ఎంట్రీ గురించి ప్రధానంగా వారు చర్చించినట్టు సమాచారం.

 పవర్ పాయింట్ ప్రజెంటేషన్:

పవర్ పాయింట్ ప్రజెంటేషన్:

హోటల్ నుంచి గ్లోబల్‌ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జరిగే హెచ్ఐసీసీ సదస్సుకు ఆమె కాన్వాయ్ ఏ రోడ్డు గుండా వస్తుందనే దానిపై పోలీస్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సదస్సు అనంతరం డిన్నర్ కోసం ఇవాంకా ఫలక్‌నుమా ప్యాలెస్ వెళ్లే సమయంలో.. ఇవాంకా కాన్వాయ్ లో మూడు వాహనాలు ఉంటాయని తెలిపినట్టు సమాచారం. ఇందులో అమెరికన్ కాన్వాయ్ తో పాటు హైదరాబాద్ పోలీసుల వాహనాలు కూడా ఉంటాయని తెలుస్తోంది.

 వివరించిన పోలీసులు:

వివరించిన పోలీసులు:

ఈ సందర్భంగా ఇవాంకా కాన్వాయ్‌ను అనుసరించే పోలీసు వాహనాల సిరీస్‌ను కూడా పోలీసులు అమెరికా భద్రతా సిబ్బందికి వివరించినట్లు సమాచారం.

ఎయిర్‌ పోర్టు ల్యాండింగ్‌, సదస్సుకు హాజరు, డిన్నర్‌, ఆ తర్వాత హోటల్‌కు వెళ్లడం, మరుసటి రోజు సదస్సు వివరాలన్ని వారికి వెల్లడించినట్టు చెబుతున్నారు.

 ఆరోజున ఇవాంకా ఏం చేయనున్నారు:

ఆరోజున ఇవాంకా ఏం చేయనున్నారు:

29వ తేదీ రాత్రి 9.20 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఇవాంకా తిరుగు ప్రయాణం కానున్నారు. అయితే 29వ తేదీన ఆమె షెడ్యూల్ ఏంటనే దానిపై ఇంకా తమకు కూడా స్పష్టత లేదంటున్నారు అమెరికా భద్రతా సిబ్బంది. ఆమె ఎక్కడికైనా వెళ్తారా?.. హైదరాబాద్ లో షాపింగ్, వగైరా ఏమైనా చేస్తారా? అన్నది తెలియదంటున్నారు.

 డైనింగ్ టేబుల్ పై ఎవరెవరు?

డైనింగ్ టేబుల్ పై ఎవరెవరు?

ఇవాంకాను రిసీవ్‌ చేసుకోడానికి విమానశ్రయానికి వెళ్లే అధికార ప్రతినిధుల వివరాలు కూడా ఇవాంకా భద్రతా సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. అలాగే డైనింగ్‌ టేబుల్‌పై ఆమెతో కూర్చునేవారి గురించి కూడా వివరాలు తెలుసుకున్నట్టు సమాచారం. ఇక సదస్సు కార్యక్రమాలు, ప్రొటోకాల్‌ వివరాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+