విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌ లోనే విద్యా సేవలు

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్య సేవలను వాట్సాప్ లో అందించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. స్కూళ్లలో అందించిన మొబైల్ నెంబర్లకు ఎప్పటికప్పుడు వివరాలను చేరవేస్తారు. విద్యార్థుల హాల్ టికెట్స్, స్కాలర్ షిప్స్ వివరాలు, సర్టిఫికెట్స్ వివరాలు, రిజల్ట్స్, మార్కులు, మెమోలు, బోనఫైడ్, ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్స్ ఇలా ప్రతి అంశం ఇకపై వాట్సాప్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు చేరనుంది. ఇక ఈ ప్రోగ్రామ్ కు డిజిటల్ మస్కట్ గా రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను ఎంపిక చేయడం విశేషం.

ఈ మేరకు వాట్సాప్ ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సంబంధించి 16 సేవలు ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్‌ బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18 లక్షల మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విద్యకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం, సేవలు, ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను నేరుగా వాట్సాప్ ద్వారా పొందే అవకాశం ఉంది.

WhatsApp Education Revolution All Student Services Now Only on Messaging App WhatsApp education

ఈ ప్రత్యేకమైన ప్లాట్‌ ఫారమ్‌ ను మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖకు చెందిన ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ- మీసేవ విభాగం, విద్యాశాఖతో కలిసి అభివృద్ధి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+