ఓవైసీ అటాక్: వివాహేతర సంబంధాలు నేరం కానప్పుడు ట్రిపుల్ తలాక్ నేరం ఎలా అవుతుంది..?

Recommended Video

    ఐపీసీ సెక్షన్ 497 పై అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్స్

    ఐపీసీ సెక్షన్ 497 పై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దేశమంతా ప్రశంసల వర్షం కురిపిస్తుండగా... మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. ఐపీసీ సెక్షన్ 497 ను ట్రిపుల్ తలాక్‌తో పోలుస్తూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. ముస్లిం మహిళల హక్కులు పై తెచ్చిన ఆర్డినెన్స్ మాత్రం న్యాయం చేయలేదని కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగారు అసదుద్దీన్.

    ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్పు వెలువడిన కొద్ది క్షణాల్లోనే ఓవైసీ ట్వీట్ల వర్షం కురిపించారు. హోమో సెక్సువాలిటీ నేరంగా పరిగణించే సెక్షన్ 377, అక్రమ సంబంధాలు నేరమని సూచించే సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ట్రిపుల్ తలాక్‌కు మాత్రం నేరమని చట్టం తీసుకురావడాన్ని మోడీ సర్కార్ ఎలా సమర్థిస్తుందో చెప్పాలన్నారు.ఇది ఎలా న్యాయం అవుతుంది.. బీజేపీ ఏం చెబుతుంది అంటూ ట్వీట్లతో ప్రశ్నించారు ఓవైసీ.

    When IPC Sections 377&497 are unconstitutional..how can triple talaq be criminalised:Owaisi

    సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని చెప్పలేదని గుర్తు చేసిన ఓవైసీ అదే సమయంలో అంశాన్ని పక్కకు మాత్రమే పెట్టిందని చెప్పారు. కానీ సెక్షన్ 377&సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పిందన్నారు. మోడీ ప్రభుత్వం ఈ రెండు తీర్పుల నుంచి పాఠం నేర్చుకుని రాజ్యాంగ విరుద్ధమైన ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ట్రిపుల్ తలాక్ నేరమని తలాక్ చెప్పిన వారికి మూడేళ్లు జైలుశిక్షతో పాటు జరిమానా విధించబడుతుందని ఆర్డినెన్స్‌లో పొందుపర్చారని గుర్తు చేసిన ఓవైసీ ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+