వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ యోగి ఎక్కడ ? ఇక జాతకాలకే పరిమితామా ?

|
Google Oneindia TeluguNews

పరిపూర్ణానంద కొద్ది రోజుల క్రితం ఆయన ఓ స్వామిజీ, ఆయన దర్శనం దొరకాలంటే చాల గంటలు,రోజులు కూడ పట్టేది.అయితే స్వామీజీ కాస్త హిందు సమాజ పరిరక్షడి అవతరామెత్తాడు, హిందువులకు ఎక్కడ అన్యాయం జరిగినా తన గళం విప్పాడు, అనంతరం రాజకీయాల్లోకి వచ్చాడు. కోద్ది రోజులు ఓవెలుగు వెలిగాడు,తెలంగాణ ఎన్నికల్లో ఆయన ప్రభావం చూపించాడు,కాని ప్రస్తుత ఎన్నికల్లో ఆయన జాతకాలకే పరిమితయ్యాడు .దీంతో ఆయన రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టేనా లేదా అనే విషయం తేలాల్సి ఉంది.

<strong>అక్కడ గంట ఆలస్యంగా పోలింగ్..! నిజామాబాద్ లో రైతు ర్యాలీకి అనుమతి ఇచ్చామన్న ఈసీ..!!</strong>అక్కడ గంట ఆలస్యంగా పోలింగ్..! నిజామాబాద్ లో రైతు ర్యాలీకి అనుమతి ఇచ్చామన్న ఈసీ..!!

హిందు ధర్మ రక్షణలో మునిగిన స్వామీజీ

హిందు ధర్మ రక్షణలో మునిగిన స్వామీజీ

స్వామిజీలు సాధరణంగా హిందు ధర్మాన్ని కాపాడేపనిలో ఉన్నప్పటికి పరిపూర్ణానంద స్వామి ఓ అడుగుముందుకు వేశాడు, బహిరంగంగానే హిందు వ్యతిరేక సంస్థలకు ,కార్యలకలాపాలకు దీటుగా పోరాడాడు, అయితే ఇదే పోరాటాన్ని ఇంకా లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నేరుగా రాజకీయాల్లోకి దిగాడు .ఈనేపథ్యంలోనే గత ఆక్టోబర్ లో ఢిల్లివెళ్లి అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరారు.దీంతో స్వామిజీ కాస్త రాజకీయ నాయకుడిగా మారాడు. అప్పుడున్న అయిదు సీట్లకు తోడు కేంద్రప్రభుత్వ అండతో మరిన్ని సీట్లను గెలుచుకోవచ్చనే ప్రణాళికతో రంగంలోకి దిగాడు .స్వామీజిగా ఉండాల్సిన ఆయన రాజకీయ రణరంగలోకి దిగి కాషాయ నాయకుడిగా మారాడు. ఈనేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లి ఎన్నికల నేపథ్యంలో ఊరువాడ తిరిగి ప్రచారం చేశాడు, దీంతో తెలంగాణ బీజేపికి సరికోత్త ఊపు వచ్చింది.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లి ఎన్నికల్లో అక్టీవ్ గా పాల్గోన్న స్వామీజీ

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లి ఎన్నికల్లో అక్టీవ్ గా పాల్గోన్న స్వామీజీ

కాగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ లో జరిగిన ఓ పూజారి హత్యపై పరిపూర్ణనంద సిరియస్ గానే ఫైట్ చేశాడు, దీంతో ఆయన్ను పోలీసులు సైతం అడ్డుకున్నారు.అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను 55 రోజుల పాటు నగర్ బహిష్కరణ కూడ చేశారు.దీంతో ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. తనను 55 రోజులు నగర బహిష్కరణ చేస్తే , 55 సంవత్సరాల పాటు ఇక్కడే ఉంటానని సవాల్ విసిరారు. తిరిగి ఆయన ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లాడు. ప్రచారంలో భాగంగా విహెచ్‌పి,బజరంగ్ దళ్, నేతలతోపాటు బీజేపీ కార్యకర్తలను కలుపుకుని ముందుకు సాగాడు.కాని స్వామి ఆశించినట్టుగా ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యాయి. పార్టీ సీనియర్ నాయకులైన కిషన్ రెడ్డి లాంటీ నేతలు కూడ ఓటమి పాలయ్యారు. పార్టీ అధ్యక్షుడు, పార్టీ ప్రతిపక్ష నేతలు సైతం ఓడిపోయారు.నగరంలో ఉన్న అయిదు సీట్లు కాస్త ఓక్క సీటుకే పరిమితమైంది. దీంతో స్వామి పరిపూర్ణనంద అనతికాలంలో రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాడు.

 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కనిపించని స్వామీజీ

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కనిపించని స్వామీజీ

కాగా బీజేపీ అంత్యంత ప్రతిష్థాత్మకంగా తీసుకుంటున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సైతం ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే స్వామిజీ మాత్రం ఎక్కడా ప్రచారం చేసినట్టు కనిపించలేదు,ముఖ్యంగా స్వామిజీ ప్రస్థానం అంతా ఆంధ్రప్రాంతమైన కాకినాడలోనే ఉంది, ఆయన శ్రీ పీఠం స్థాపించి దాని ద్వారనే ఆయన వెలుగులోకి వచ్చాడు.అయినా ఆంధ్రప్రదేశ్ వైపు కన్నేత్తి కూడ చూడలేదు. ఎందుకనో తెలంగాణ లో పాల్గోన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో ప్రచారంలో దూసుకెళ్లలేదు,,ఓ వైపు ప్రధాని మోడి, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతోపాటు పలువురు కేంద్రమంత్రులు కూడ ఏపికి వచ్చి ప్రచారాన్ని నిర్వహించారు, పరిపూర్ణానంద స్వామిజి మాత్రం ఎక్కడ క్రియాశీలకంగా పాల్గోనలేదు,

ఇక జాతకాలకే పరిమితమా

ఇక జాతకాలకే పరిమితమా

కట్ చేస్తే ఇటివల ఉగాది సంధర్భంగా ఆయన జాతాకాలు చెబుతున్నట్టు కనిపించింది. ఓవైపు హోరా హోరి ఎన్నికలు జరగుతున్న వేళ ఆయన మాత్రం చాల ఫాస్ట్ గా రాజకీయాల్లోకి వచ్చి అంతే ఫాస్ట్ గా వెనుదిరిగినట్టు కనిపిస్తోంది. రాజకీయ నాయకులకు ఎన్నికలే ప్రధానం, ఆప్పుడే ప్రజల మధ్య తిరగి తమ బలాన్ని నిరూపించకోవాలి, అలాంటీ సంధర్భంలోనే ప్రజల మధ్యకు రాని నేతలు ,అనంతరం అక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశాలు ఉండవు,దీంతో పరిపూర్ణానంద కూడ శాశ్వతంగా పాలిట్రిక్స్ కు దూరంగా ఉంటారని బావించవచ్చు .దీంతో ఆయన రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాని కొంత విరామం తర్వాత మళ్లి వస్తారా లేక ఇదే పరిస్థితిని కొనసాగిస్తారా అనేది స్వయంగా స్వామీజీ ప్రకటించాల్సి ఉంది.

English summary
where is telangana yogi swami paripoorna nanda , does he take 'u' turn from politics ? why he is not participated in ap election campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X