Super Market: డీ మార్ట్, స్టార్ బజార్.. ఎందులో ధరలు తక్కువా..!

మీరు నిత్యావసర సరకులు ఎక్కడ కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న సామాను అయితే కిరాణా దుకాణాల్లో కొనుగోలు చేస్తారు. నెలకు సరిపడ సరకులు కావాలంటే.. సూపర్ మార్కెట్ కు వెళ్తారు. సూపర్ మార్కెట్ అంటే మనకు మొదటగా గుర్తొచ్చేది.. డీ మార్ట్.. ఇప్పుడు డీ మార్ట్ సూపర్ మార్కెట్లు చిన్న చిన్న పట్టణాల్లో కూడా అందుబాటులోకి వచ్చాయి. డీ మార్ట్ కాకుండా స్టార్ బజార్, స్మార్ట్ బజార్, మోర్, హెరిటేజ్, రత్నదీప్, విజేత తో పాటు పలు సూపర్ మార్కెట్లు ఉంటాయి. అయితే వీటిలో డీ మార్ట్ కు ఎక్కువగా వెళ్తుంటారు.

డీ మార్ట్ కు పోటీగా స్టార్ బజార్ కూడా రాణిస్తోంది. అయితే చాలా మందికి డీ మార్ట్ లోనే ధరలు తక్కువ అని అనుకుంటారు. కానీ స్టార్ బజార్ లో కూడా ధరలు తక్కువగానే ఉంటాయని పలువురు కస్టమర్లు చెబుతున్నారు. స్టాక్ బజార్ డిమార్ట్ కంటే తక్కువ ధరలు ఉంటాయని వివరిస్తున్నారు. అక్టోబర్ 18 నాడు డీ మార్ట్ లో ఒక లీటర్ గోల్డ్ డ్రాప్ శన్ ఫ్లవర్ ఆయిల్ ధర రూ.131 ఉండగా.. స్టార్ బజార్ అంత కంటే తక్కువగాన ఉందని చెబుతున్నారు. పోహ అటుకులు కూడా డీ మార్ట్ కంటే స్టార్ బజార్ లోనే తక్కువగా ఉందని పేర్కొంటున్నారు.

Where prices are lower in D Mart or Star Bazaar

అయితే తెలంగాణతోపాటు హైదరాబాద్ లో చాలా చోట్ల డీ మార్ట్ సూపర్ మార్కెట్లు ఉన్నాయి. కానీ స్టార్ బజార్ సూపర్ మార్కెట్లు తక్కువ ప్రాంతాల్లో ఉన్నాయి. కాగా దేశంలో డీ మార్ట్ సూపర్ మార్కెట్లు 200 కంటే ఎక్కువగా ఉన్నాయి. అయితే డీ మార్ట్, స్టార్ బజార్ ల్లో ధరలు తక్కువగా ఉండడానికి ఒక కారణం ఉంది. సాధారణంగా ఒక కిరణా షాపులో వస్తువు కొనుగోలు చేస్తే అది.. తయారుదారుడి నుంచి డిస్ట్రీబ్యూటర్ కు రావాలి. అక్కడ నుంచి హోల్ సేల్ కు రావాలి. అక్కడి నుంచి రిటైల్ రావాలి.. అప్పటికీ ధర ఎక్కువ అయిపోతుంది.

అదే డీమార్ట్, స్టార్ బజార్ ల్లో వారు డైరెక్ట్ గా తయారీదారుడి నుంచి వస్తువులు తీసుకొస్తారు. దీంతో వాటిని తక్కువ ధరకు అమ్ముకునే వీలు ఉంటుంది. పైగా వీరు భారీ మొత్తంలో ఆర్డర్ ఇస్తారు కాబట్టి తక్కువ ధరకు వస్తువులు వస్తాయి. అంతే కాక.. మార్కెట్లోకి ఏదైనా కొత్త ప్రాడక్ట్ వచ్చినప్పుడు.. దాని ప్రజాధారణ పెరగాలంటే.. డీ మార్ట్ వారికి తక్కువ ధరకే వస్తువులు ఇస్తారని తెలిసిన వారు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+