అక్కడ బాంబ్ పేలింది..! ఇక్కడ పేరు మారింది..! అది వరస..!!
హైదరాబాద్ : పాకస్తాన్ లో అంతర్బాగమైన కరాచి పేరుతో మొన్నటి వరకూ ఆరు కేకులు, మూడు బిస్కట్లుగా వ్యాపారం జోరుగా సాగేది. కరాచీ బేకరీతో విక్రయించే తినుబండారాలలో భారతీయులు మొన్నటి వరకు రుచిని మాత్రమే చూసారు తప్ప పేరు వెనక ఉన్న జాతి విద్వాషాన్ని ఏనాడు ఖాతరు చేయలేదు. కాని మొన్నటికి నేటికి పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. పాకిస్తాన్ పేరు చెప్తేనే భారతీయుల రక్తం మరుగుతోంది. దీంతో పాకిస్తాన్ కు సంబందించిన పేరునుగాని, దాని భూభాగంలో ఉన్న ప్రాంతాల పేరును గాని ఉచ్చరించేందుకు భారతీయులు ససేమిరా అంటున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కరాచీ బేకరీ పేరుతో కొనసాగుతున్న సంస్థ తన పేరును మార్చుకొనేందకు నిర్ణయం తీపుకున్నట్టు తెలుస్తోంది. దీంతో భారతీయుల భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిపోతోంది.

కరాచీ బేకరీ పేరును ఇకపై ఇండియన్ కరాచీ బేకరీగా మారుస్తూ ఆ సంస్ధ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గొడుగు శ్రీనివాస్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. పుల్వామ ఉగ్రదాడి అనంతరం దేశవ్యాప్తంగా 'కరాచీ బేకరీ'లకు హెచ్చరికలు మొదలైన విషయం తెలిసిందే. పేరు మార్చుకోవలసిందే అంటూ పలువురు డిమాండ్ చేశారు. దీంతో ఆ సంస్థ తమ బ్రాంచ్‌ల దగ్గర సెక్యురిటీ పెంచడంతో పాటు ఇది అచ్చమైన భారతీయ సంస్థేనని వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. అయితే పేరు మార్పుపై కరాచీ బేకరీ యాజమాన్యం తాజాగా ఓ ప్రకటకన చేసింది. ఇకపై తమ సంస్థలకు 'ఇండియన్ కరాచీ'గా పేరు మారుస్తున్నట్టు తెలిపింది. మోజాంజాహి మార్కెట్ దగ్గర ఉన్న కరాచీ బేకరీ యాజమాన్యాన్ని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ ఆధ్వర్యంలోని బీజేపీ నేతలు సంప్రదించగా ఈ మేరకు హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో ఇండియన్ కరాచీ బేకరీ పేర్లు అన్ని బేకరీలకు మారుస్తామని యాజమాన్యం తెలిపినట్టు తెలుస్తోంది.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
"పాకిస్థాన్ లో నిద్రలేచిన నరరూప రాక్షసులు.. భారత్ కు పెను ముప్పు" -
VIRAL: ధురంధర్ 2 కలెక్షన్స్ లో 80 శాతం మాకు ఇవ్వండి: పాకిస్థాన్ ప్రజల డిమాండ్ -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు!












Click it and Unblock the Notifications