'తెలంగాణ ప్రజలకు శుభవార్త, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండేది ఇంకా కొన్ని రోజులే'

Recommended Video

    కేసీఆర్ సవాల్ కు ఉత్తమ్ సై

    హైదరాబాద్: ఎన్నికలకు సిద్ధమా అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన సవాల్‌పై తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం స్పందించారు. ఎన్నికలకు తాము సైఅన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

    ఎన్నికలు 2019లో వచ్చినా, ఈ ఏడాది డిసెంబర్ నెలలో వచ్చినా, ఈ రోజే వచ్చినా తాము సిద్ధమని చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఇది శుభవార్త అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మరెన్నో రోజులు ఉండదని, ఇంకా కొన్ని రోజులే ఉంటుందని ఉత్తమ్ చెప్పారు.

    Whether it is May, 2019 or December, 2018 or today Congress is fully prepared and geared up to pull down TRS: Uttam

    ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా స్పందించారు. ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అవసరమైతే, రేపు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని కూడా ఒప్పిస్తామన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కు లేఖ రాయడంతో పాటు, టీ-కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్, సీనియర్ నేత జానారెడ్డితో కూడా చర్చిస్తామన్నారు. కేసీఆర్ కేబినెట్లో బీసీలకు ఎంత వరకు న్యాయం చేశారని ప్రశ్నించారు.

    కాగా, ఆదివారం తెరాసలో మాజీ మంత్రి దానం నాగేందర్ చేరిన సమయంలో కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, విపక్షాల సంగతి ఏమిటని ప్రశ్నించారు. విపక్షాలు సరేనంటే ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలకు తాము సిద్ధమన్నారు. దేశంలో ముందస్తు ఎన్నికలు రావొచ్చను తనకు అనుమానంగా ఉందని, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నట్లు తమ పార్టీ నేతలు చెబుతున్నారన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+