Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జేపీ నడ్డా చెప్పులు ఏ గులాం మోస్తారు? కేటీఆర్ ప్రశ్న; బీజేపీ ఘాటు రిప్లై!!

తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ నిర్వహిస్తున్న మూడో విడత పాదయాత్ర పొలిటికల్ హీట్ పుట్టించింది. టిఆర్ఎస్ పార్టీకి బీజేపీకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి కారణమైంది. బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించిన నాటినుండి బండి సంజయ్ టీఆర్ఎస్ పార్టీని, కెసిఆర్ కుటుంబ పాలనను, అవినీతిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక బండి సంజయ్ పాదయాత్రతో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు పర్వం కొనసాగింది.

తెలంగాణాలో బండి సంజయ్ పాదయాత్రతో పొలిటికల్ హీట్

తెలంగాణాలో బండి సంజయ్ పాదయాత్రతో పొలిటికల్ హీట్

ఏ చిన్న అవకాశం దొరికినా, ఒకరిపై ఒకరు నేతలు టార్గెట్ చేస్తూ రాజకీయ వేడి పుట్టించిన తీరు తెలంగాణ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్ పాదయాత్రలో కొనసాగిన దాడులు, అరెస్టులు, నిరసన పర్వాలు, కోర్టులో పిటిషన్లు వెరసి తెలంగాణలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంది. ఒకపక్క మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బిజెపి అక్కడ దూకుడు పెంచుతూనే, మరోపక్క బండి సంజయ్ పాదయాత్రకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం పై సమర శంఖాన్ని పూరించడం ప్రధానంగా కనిపించింది.

అమిత్ షా చెప్పులు మోసిన బండి సంజయ్ .. టార్గెట్ చేస్తున్న టీఆర్ఎస్


ఇక ఇదే సమయంలో మునుగోడు ఉపఎన్నిక ప్రచారం కోసం మునుగోడు కు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అమిత్ షా చెప్పులు తీసి ఆయన కాళ్ళ ముందు పెట్టడం టిఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తుంది. అప్పటినుండి ఇప్పటివరకు ఢిల్లీ పాలకుల చెప్పులు మోసే బానిసలు అంటూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుజరాతి పాలకుల ముందు తాకట్టు పెట్టారని, ఢిల్లీ గులాములు అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పదేపదే టిఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు.

ఢిల్లీ చెప్పులు మోసే గులాములు అంటూ టార్గెట్ చేసిన మంత్రి కేటీఆర్


బండి సంజయ్ చెప్పులు మోసిన వీడియో ని టార్గెట్ చేసిన మంత్రి కేటీఆర్ అప్పుడు కూడా తనదైన శైలిలో బండి సంజయ్ ను టార్గెట్ చేశారు. ఢిల్లీ "చెప్పులు" మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుడిని - తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది అంటూ పేర్కొన్నారు. ఢిల్లీ పాలకులకు, గుజరాతి నాయకులకు బండి సంజయ్ చెప్పులు మోస్తున్నాడని,తెలంగాణలో అటువంటి నాయకత్వం ఉందని బండి సంజయ్ ను టార్గెట్ చేశారు.అంతేకాదు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నదిఅంటూ మంత్రి కేటీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్న బిజెపిని తరిమికొడతారు అంటూ బీజేపీ పై నిప్పులు చెరిగారు.

జేపీ నడ్డా చెప్పులు మోసే గులాం ఎవరు? కేటీఆర్ ట్వీట్


ఇక తాజాగా ఈరోజు హన్మకొండ లో బిజెపి బహిరంగ సభ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నగరానికి రానున్న సమయంలో సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్ బిజెపి ని టార్గెట్ చేశారు. ఈరోజు జేపీ నడ్డా చెప్పులు ఏ గులాం మోస్తారు అంటూ, పాప్ క్విజ్ అంటూ పేర్కొన్న మంత్రి కేటీఆర్ ఇక చెప్పులు మోయడానికి బిజెపి నాయకుల మధ్య తీవ్రమైన పోటీ వుందని కచ్చితంగా తాను అనుకుంటున్నాను అంటూ సెటైర్లు వేశారు.

మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇస్తున్న బీజేపీ


ఇక మంత్రి కేటీఆర్ చేసిన పోస్టుకు బిజెపి కార్యకర్తలు తమదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపతో కాళ్లు మొక్కించుకున్న ట్విట్టర్ టిల్లు ఈ రోజు ట్విట్టర్ లో నీతులు చెబుతున్నాడు అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు గతంలో ఆంధ్ర పాలకులకు ఫోటోలు తీసి చెంచాగిరి చేసింది ఎవరు ? జైలుకు పోయిన ఝార్ఖండ్ హంతకుడు అవినీతిపరుడు కాళ్లు మొక్కింది ఎవరు? చెప్పాలంటూ మంత్రి కేటీఆర్, కెసిఆర్ ఫోటోలను పోస్ట్ చేసి రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. ఓ రేంజ్ లో ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+