Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏం చూసుకుని ఆ బరితెగింపు?దాడులు చేసే హక్కు ఎవరిచ్చారు?బండి భగీరధపై సర్వత్రా ఆగ్రహజ్వాలలు.!

హైదరాబాద్ : ఒంటి మీద పిడికెడె కండ లేదు... ఆరడుగుల ఆజానుబాహుడు కాదు.. కండల వీరుడు అంతకన్నా కాదు.. ఐనా ఎదుటి వారిని ఎగిరెగిరి కొడుతున్నాడు. సరిగ్గా ఎక్కడ కొట్టాలో చూసి అక్కడే ఎగిరి కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.. మోహం మీద పిడిగుద్దులు గుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. పక్కన ఉన్న తొట్టి గ్యాంగ్ సహకారం లేకుండా ఒక్కడే దాడి చేసి "హీరో చితక్కొట్టాడురా" అనిపించుకోవాలనే తాపత్రయంలో నిస్సహాయుల మీద వీరంగం.. ఇదంతా చేస్తుంది ఎవరనుకుంటున్నారా? అదే బీజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ తనయుడు బండి భగీరధ వీర పోరాట సన్నివేశాలు. భగీరధ ముష్టి ఘాతాలు ఆయన తండ్రి బండి సంజయ్ రాజకీయ ప్రస్తానానికి ఖచ్చితమైన శరాఘాతమనే చర్చ ఊపందుకోవండంతో పాటు ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి.

బండి సంజయ్ కుమారుడు వీర తెగింపు..

బండి సంజయ్ కుమారుడు వీర తెగింపు..


బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ బౌతిక దాడులకు సంబంధించిన వీడియో టేపులు సంచలనంగా మారాయి. ఎదుటి వాడు ఎంత పెద్ద తప్పు చేసినా శిక్షించడానికి ఈ కొత్తెం గాడు ఎవడు అనే గుసగులసు కూడా వినిపిస్తున్నాయి. పక్కన నలుగురు పనికి మాలిన స్నేహితులు ఉన్నారు కదా అని ఎదుటి వారిని ఒంటిరిని చేసి, గదిలో బంధించి బూతులు తిడుతూ బౌతిక దాడులు చేయడం మానవ లక్షణమా.? మృగ లక్షణమా తెలుసుకోవాలని నెటిజనులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

కొడుకుల ద్వారా మట్టికరిచిన తండ్రులు..

కొడుకుల ద్వారా మట్టికరిచిన తండ్రులు..

ఒకప్పటి ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ మనుగడ తన కొడుకుల ద్వారా ఏవిధంగా మట్టికరిసిందో అందరికి తెలుసు. ఇప్పుడు బండి సంజయ్ అశంలో కూడా అదే పునరావృతం అవుతుందని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ వెనక నిగూఢార్దం దాగుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తండ్రి రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని నిస్సహాయులను, అభాగ్యులను వేధించడం, దాడులు చేయడం వంటి చర్యలు ఎలాంటి ఫలితాలనిస్తాయో చరిత్ర చెప్పలేదా.? బండి భగీరధకు ఆ అంశాలు తెలియవా అని బండి భగీరధ వీడియోలు చూసిన ప్రతిఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

బండి భగీరధ క్రూరత్వం..

బండి భగీరధ క్రూరత్వం..

అసలు సమాజంలో తోటి సహచరులు శత్రువులైనప్పటికి చట్టం దాని పని అది చేస్తుందిలే అని చాలా వరకు వదిలేస్తుంటాం. కాని చట్టాన్ని చేతులోకి తీసుకుని శిక్షలు ఖరారు చేసి అమలు చేసే బండి భగరధ వి ఆటవిక చర్యలు కావా అని ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. సమాజంలో తప్పుచేయని వాడెవడు.? తప్పు చేసిన ప్రతి ఒక్కడిపైనా ఇలాంటి దాడులు చేస్తాడా బండి సంజయ్ కొడుకు అని నిలదీస్తున్నారు. కొట్టించుకునే వాడు మంది మార్బలాన్ని చూసి చేతులు కట్టుకొని కొట్టించుకుంటున్నారు గానీ తిరగబడి ఒక్క గుద్దు గుద్దు గుద్దితే బండి భగీరధ జీవత కాలం స్వతహాగా నడవగలడా అనే సందేహాన్ని కూడా నెటిజనులు వ్యక్తం చేస్తున్నారు.

కొడుకుని అదుపులో పెట్టుకోవాలి..

కొడుకుని అదుపులో పెట్టుకోవాలి..

బండి సంజయ్ కొడుకు బండి భగీరధ చేతిలో దెబ్బలు తిన్న ప్రతి వాడు.. వాళ్లు చేసిన తప్పుల గురించి భగీరధ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు. వాళ్లు చేసింది తప్పని తెలిస్తే శిక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ బండి భగీరధకు ప్రత్యేక అధికారలను ఏమైనా కట్టబెట్టారా..? లేకపోతే బండి భగీరధ కోసం తెలంగాణ బీజేపి అదనపు చట్టాన్ని పొందుపరిచిందా.? భగీరధకు ఎందుకంత బరితెగింపు.? అనే చర్చ జరుగుతోంది. తండ్రుల అధికారాన్ని అడ్డం పెట్టుకుని కన్ను మిన్ను కానకుండా, మదమెక్కి వ్యవహరించిన కొడుకులు చరిత్ర, తండ్రుల ఖ్యాతి ఎంత నీచంగా కాలగర్బంలో కలిసిపోయిందో బండి భగీరధ తెలుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటున్నారు నెటిజనులు. బండి సంజయ్ కూడా కొడుకు మూర్ఖపు చేష్టలకు వత్తాసు పలకకుండా కొరఢా ఝుళిపించాలని కూడా విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి. సో బండి సంజయ్ గారూ.. వాట్ నెక్స్ట్..?..

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+