మహేష్ బాబు 'భరత్ అనే నేను': 'కేటీఆర్ దారిలో'పై గల్లా జయదేవ్ కౌంటర్
అమరావతి/హైదరాబాద్: ఓ పత్రికలో వచ్చిన వార్తకు తెలుగుదేశం పార్టీ నేత, గుంటూరు పార్లమెంటు సభ్యులు మహేష్ బాబు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అడుగుల్లో తాను నడుస్తున్నట్లుగా వచ్చిన కథనంపై ఆయన స్పందించారు.
మహేష్ బాబు నటించిన రాజకుమారుడు సినిమా సమయం నుంచి తాను ఫంక్షన్లకు వెళ్తున్నానని, అంతేకాకుండా అతనికి తాను పెద్ద ఫ్యాన్ అని గల్లా జయదేవ్ పేర్కొన్నారు. ఎవరు ఎవరిని ఫాలో అవుతున్నారు.. అని ప్రశ్నించారు. 'కేటీఆర్ అడుగుజాడల్లో గల్లా జయదేవ్ ' అనే కథనానికి ఆయన కౌంటర్ ఇచ్చారు.

మహేష్ బాబుతో కలిసి కేటీఆర్ ఇంటరాక్షన్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం ఘన విజయం సాధించింది. మంచి కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఇటీవల కేటీఆర్ ఈ సినిమాను చూశారు. సినిమా బాగుందని కితాబిచ్చారు. అనంతరం కొరటాల శివ, మహేష్ బాబుతో కలిసి ఇంటరాక్షన్ నిర్వహించారు.

మహేష్ బాబు వెంట గల్లా జయదేవ్
ఆ తర్వాత మహేష్ బాబు విజయవాడలో బెజవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో వెంట ఆయన బావ, ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. మహేష్ బాబు పర్యటనను గల్లా దగ్గరుండి చూసుకున్నారట. తిరుపతి పర్యటనలోను ఆయన వెంటే ఉన్నారు.

గల్లా జయదేవ్ కౌంటర్
మహేష్ బాబు, గల్లా జయదేవ్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయి. దీంతో కేటీఆర్ రూట్లో గల్లా జయదేవ్ వెళ్తున్నారంటూ.. కొందరు సినిమా తారలతో ఫోటోలు దిగుతున్నారని, సోషల్ మీడియాలో పంచుకుంటున్నారని పేర్కొన్నారు. దీనికి గల్లా జయదేవ్ కౌంటర్ ఇచ్చారు.

నాయకుల ప్రశంసలు
తమకు సినిమాలు నచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఆ సినిమాలు మెచ్చుకుంటూ ట్వీట్ చేయడం మామూలే. తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని కూడా గతంలో కేటీఆర్ చెప్పారు. ఇటీవల రంగస్థలం సినిమాను చూసి నారా లోకేష్, భరత్ అనే నేను చూసి కేటీఆర్, ఇతర నాయకులు ప్రశంసలు కురిపించారు.












Click it and Unblock the Notifications