డ్రగ్స్‌తో దొరికితే పెడ్లర్! వాడితే బాధితుడు: శిక్షలు ఎలా ఉంటాయంటే?

డ్రగ్స్ రాకెట్ కేసు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న వేళ పలు సందేహాలు నెలకొన్నాయి. అసలు డ్రగ్స్ కేసుల్లో పెడ్లర్(డీలర్) అంటే ఎవరు?, బాధితులు ఎవరు? అనే అంశాలపై ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది.

హైదరాబాద్: డ్రగ్స్ రాకెట్ కేసు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న వేళ పలు సందేహాలు నెలకొన్నాయి. అసలు డ్రగ్స్ కేసుల్లో పెడ్లర్(డీలర్) అంటే ఎవరు?, బాధితులు ఎవరు? అనే అంశాలపై ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది.

నిబంధనల ప్రకారం..

నిబంధనల ప్రకారం..

ఎన్డీపీఎస్(నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్) యాక్ట్ ప్రకారం నిబంధనలు, శిక్షలు ఇలా ఉన్నాయి. ఓ వ్యక్తిని దర్యాప్తు విభాగాలు తనిఖీ చేసినప్పుడు అతడి వద్ద డ్రగ్స్ దొరికితేనే అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

పెడ్లర్ ఇలా..

పెడ్లర్ ఇలా..

అలాగే అతడు డ్రగ్స్ ఇతరులకు అమ్ముతున్నట్లు విచారణలో ఆధారాలు లభిస్తేనే.. ఆ వ్యక్తిపై పలు సెక్షన్ల కింద పెడ్లర్‌గా నేరారోపణ మోపే అధికారం ఉంటుంది. అలా కాకుండా డీలర్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి తాను మాత్రమే వాడుతున్నట్లు తెలిస్తే.. అతడిని అరెస్ట్ చేసే అవకాశం లేదు. ఆ సమయంలో అతడు బాధితుడు అవుతాడు.

Recommended Video

    Tollywood drugs scandal : Tollywood Top Director, Heroes and 3 Heroines Names revealed
    సడలింపులు కూడా..

    సడలింపులు కూడా..

    ఈ క్రమంలో అతడికి ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేయాలని చట్టంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఒక వేళ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత.. తాను డ్రగ్స్ తీసుకుంటున్నట్లు కోర్టులో ఒప్పుకుంటూ డీ అడిక్షన్ సెంటర్‌కు వెళ్తానని స్వయంగా చెబితే బెయిల్ విషయంలో కూడా సడలింపులుంటాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

    శిక్షలు ఇలా..

    శిక్షలు ఇలా..

    ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రకారం శిక్షలు ఇలా ఉంటాయి.

    హెరాయిన్ - 5గ్రా. -250గ్రా. - (ఆరు నెలలు-10ఏళ్ల నుంచి 20ఏళ్లు)
    ఓపియమ్ - 25గ్రా. - 2.5గ్రా. - (ఆరు నెలలు - 10ఏళ్ల నుంచి 20ఏళ్లు)
    గంజాయి - 1000గ్రా. - 20 కేజీలు - (ఆరు నెలలు - 10నుంచి 20ఏళ్లు)
    చరాస్ - 100 గ్రా. - 1కేజీ - (ఆరు నెలలు - 10నుంచి 20ఏళ్లు)
    కొకైన్ - 2గ్రా. 100 గ్రాములు -(ఆరు నెలల - 10నుంచి 20ఏళ్లు)
    మెథడన్ - 2గ్రా. 50గ్రా. - (ఆరు నెలలు. - 10నుంచి 20ఏళ్లు)
    అంఫథెటమిన్ - 2గ్రా. - 50గ్రా. - (ఆరు నెలలు - 10నుంచి 20ఏళ్లు)
    ఎల్ఎస్‌డీ - 0.002గ్రా.- 0.1గ్రా. - (ఆరు నెలలు - 10నుంచి 20ఏళ్లు)

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+