తెలుగు సినీ పరిశ్రమ పరువు తీస్తున్న హీరో??
ఆ కథానాయకుడికి సినీ పరిశ్రమలో ఉండే కష్టాలన్నీ తెలుసు. ఎందుకంటే అన్ని కష్టాలు పడి కథానాయకుడిగా నిలదొక్కుకున్నాడు కాబట్టి. మాస్ సినిమాలకు, కమర్షియల్ సినిమాలకు ఆ కథానాయకుడి సినిమాలు పెట్టింది పేరు. అటువంటి హీరో ఎలా ఉండాలి? .. అవసరమైతే నిర్మాతలను ఆదుకోవాలి.. సినిమాను తన భుజస్కంధాలపై మోయాలి.. చిన్న కార్మికులకు ఉపాధి దొరికేలా చూడాలి.. కానీ సదరు కథానాయకుడే సినిమాకు భారంగా మారితే నిర్మాత ఏం కావాలి? ఎవరికి చెప్పుకోవాలి?

షూటింగ్ చివరిలో అలకపాన్పు ఎక్కడం అలవాటైంది!!
సినిమా షూటింగ్ చిట్ట చివరి నిముషాల్లో ఉండగా అలకపాన్పు ఎక్కుతూ నిర్మాతల దగ్గర నుంచి అదనంగా వసూలు చేస్తున్న సొమ్ముతో బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడమే సరిపోతోంది. ఎందుకంటే సదరు హీరోగారికి తన భవిష్యత్తు కూడా కళ్లకు కట్టినట్లు కనపడుతోంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తన మార్కెట్ మహా ఉంటే మూడు లేక నాలుగు సంవత్సరాలుంటుంది. ఆ తర్వాత మనవైపు కన్నెత్తి చూసేవారుండరు అని ఆయన గట్టిగా ఫిక్సయినట్లున్నారని, అందుకే ఇలా వ్యవహరిస్తున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు.

డబ్బింగ్ చెప్పాలంటే రూ.2 కోట్లు?
షూటింగ్‌లో ఉండగానే మంచి క్రేజ్ తెచ్చుకున్న సినిమాకు చివర్లో డబ్బింగ్ చెప్పలేదు. అదనంగా రెండుకోట్ల రూపాయలిస్తేనే చెబుతానంటూ నిర్మాతకు కబురు చేశారు. అగ్రిమెంట్‌లో లేకపోయినప్పటికీ సదరు నిర్మాత రూ.2 కోట్లు ఇచ్చి డబ్బింగ్ చెప్పించుకోవాల్సి వచ్చింది. అంతేకాదు షూటింగ్ జరుగుతున్నప్పుడే రెమ్యునరేషన్‌ను కూడా ముక్కుపిండి మరీ వసూలు చేశారు.

మళ్లీ సేమ్ సీన్ రిపీట్?
మళ్లీ ఇప్పుడు షూటింగ్‌లో ఉండగానే విడుదల తేదీ కూడా ప్రకటించిన ఒక సినిమాకు కూడా చివర్లో ఒక పాట, డబ్బింగ్ మిగిలాయి. దీనికి కూడా అంతే. అదనంగా రూ.2కోట్లు ఇస్తేనే షూటింగ్‌కు హాజరవుతారంట అంటూ నిర్మాతకు కబురు చేశారు. చివరకు కక్కలేని, మింగలేని పరిస్థితుల్లో హీరోగారు అడిగినంత నిర్మాత సమర్పించుకున్నారు. హీరోగారు డబ్బులు ఎలా అడుగుతారోకానీ తర్వాత రోజు నుంచి ముఖముఖాలు చూసుకోవలి కదా అన్న ఆలోచనకానీ, సిగ్గుకానీ ఆయనకు లేవని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

సినీ పరిశ్రమలో నిర్మాతల హీరో అంటే సూపర్‌స్టార్ కృష్ణ
సూపర్‌స్టార్ కృష్ణ కథానాయకుడిగా సూపర్ ఫామ్‌లో ఉన్న సమయంలో ఎప్పుడూ నిర్మాతలను ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవని, ఒకవేళ సినిమా పరాజయం పాలైతే పారితోషికం తీసుకోకుండా ఆ నిర్మాతకు తర్వాత సినిమా చేసిపెట్టేవారని, సినీ పరిశ్రమలో నిజమైన హీరో కృష్ణ అంటూ ఇప్పటికీ చెప్పుకుంటారని, అటువంటి కథానాయకులున్న పరిశ్రమలో ఈ కథానాయకుడు ఒక చీడపురుగు లాంటివాడంటూ ఆయనతో సినిమా చేసి అదనంగా డబ్బులు సమర్పించుకున్న నిర్మాత అంతర్గత చర్చల్లోవ్యాఖ్యానిస్తున్నారంటే ఆయన బాధను అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications