వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు అలా చెప్పట్లేదేం, వీడియో ఉంది: కడియం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం ధ్వజమెత్తారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తదితరులు మాట్లాడారు. రేవంత్ రెడ్డి వ్యవహారంతో తనకు సంబంధం లేదని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ చేసే అభివృద్ధిని అడ్డుకునే కుట్ర జరుగుతోందన్నారు.

రూ.50 లక్షల వ్యవహారంపై టీడీపీ బుకాయింపు మానుకోవాలన్నారు. టీడీపీ నుండి వచ్చిన వాళ్లు ద్రోహులు అయితే, టీడీపీని ద్రోహుల పార్టీ అని ఎర్రబెల్లి అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో చంద్రబాబు నేరుగా మాట్లాడినట్లు వార్తలు విన్నానని, ఏసీబీ విచారణలో అన్నీ తేలుతాయన్నారు.

చంద్రబాబు బతుకే బేరసారాలు, వెన్నుపోట్లు అన్నారు. రాజకీయాల్లో బేరసారాలకు ఆధ్యుడు చంద్రబాబే అన్నారు. ఆయన చెప్పేవన్నీ నీతులు, చేసేవి కుట్రలన్నారు. తెర ముందు ఓ మాట, తెర వెనుక మరోమాట మాట్లాడటం చంద్రబాబు నైజమన్నారు.

మండలి సభ్యులు

మండలి సభ్యులు

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. వారిచే మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రమాణ స్వీకారం చేయించారు.

కడియం, తుమ్మల

కడియం, తుమ్మల

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. వారిచే మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. హగ్ చేసుకుంటున్న తుమ్మల, కడియం.

కడియం

కడియం

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. వారిచే మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేస్తున్న కడియం

మండలి సభ్యులు

మండలి సభ్యులు

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. వారిచే మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులకు పుష్పగుచ్ఛాలు

తుమ్మల

తుమ్మల

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. వారిచే మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేస్తున్న తుమ్మల.

మండలి సభ్యులు

మండలి సభ్యులు

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. వారిచే మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రమాణ స్వీకారం చేయించారు.

విద్యాసాగర్

విద్యాసాగర్

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. వారిచే మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేస్తున్న విద్యాసాగర్.

యాదవ రెడ్డి

యాదవ రెడ్డి

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. వారిచే మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేస్తున్న యాదవ రెడ్డి.

ఆకుల లలిత

ఆకుల లలిత

కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యురాలిగా గెలిచిన ఆకుల లలిత రిటర్నింగ్ అధికారి నుండి సర్టిఫికేట్ తీసుకుంటున్న దృశ్యం.

స్టీఫెన్ సన్‌కు రేవంత్ రెడ్డి ముడుపులు ఇస్తూ ఏసీబీకి అడ్డంగా దొరికినా టీడీపీ నేతలు నిస్సిగ్గుగా మాట్లాడుతూ బుకాయిస్తున్నారన్నారు. రేవంత్ పలుమార్లు చంద్రబాబు పేరును ప్రస్తావించింది వీడియోలో ఉందన్నారు. రేవంత్ ఘటనను ఖండించే ధైర్యం చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారన్నారు. ఈ వ్యవహారం నడిపిందే బాబు అన్నారు.

తాము కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయమని తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. తెలుగు జాతిని కలపాల్సిన పని ఏం లేదని చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. పొరుగు రాష్ట్రంతో ఎలా ఉండాలో ఏపీ సీఎం తెలుసుకోవాలని హితవు పలికారు.

English summary
Why Chandrababu is not responding on Revanth issue: Kadiyam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X