మోడీకి కేసీఆర్ మద్దతు వెనుక..
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు వివరణ ఇవ్వాలని తెలంగాణ సీఎల్పీ నేతలు డిమాండ్ చేశారు. పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు మొదట్లో వ్యతిరేకించిన కేసీఆర్ ఆ తర్వాత ఇప్పుడు మద్దతునివ్వడంలోని ఆంతర్యమేంటని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నోట్ల రద్దు వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని దుయ్యబట్టారు. రుణ మాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, డబుల్ బెడ్ రూమ్ వంటి ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications