వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్‌తరుణ్ ఎందుకు పరుగెత్తాడు.. 24 గంటలు గడిచాకే మీడియాముందుకు రావడంలో ఆంతర్యమేంటీ ?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఇటీవల హీరో రాజ్ తరుణ్ కారు ఔటర్ రింగ్ రోడ్ అల్కాపురి టౌన్ షిప్ వద్ద ప్రమాదానికి గురైంది. అందులో రాజ్‌తరుణ్.. అతని ముగ్గురు స్నేహితులు ఉన్నారు. బెలూన్ ఓపెన్ కావడంతో ఉన్న వారందరికీ ప్రాణాపాయం తప్పింది. తరుణ్ ఫ్రెండ్స్ చిన్నగాయాలతో బయటపడ్డారు. రాజ్‌తరుణ్ మాత్రం ప్రమాదం జరిగిన వెంటనే పరుగెత్తారు. అసలే అర్థరాత్రి 12 దాటింది. ఆ సమయంలో ఆయన ఎందుకు పరుగెత్తాడు. ఆయన చెబుతున్న భయం నిజమేనా ?

భయపడతాం ..

భయపడతాం ..

సాధారణంగా రోడ్డు ప్రమాదం జరిగితే భయపడిపోతాం .. అక్కడి నుంచి వెళ్లేందుకు జంకుతాం. వెలుతురులో జరిగితే పరిస్థితి ఇలా ఉంటే ఇంకా చీకటిలో అయితే పరిస్థితి మరీ దారుణం. అలాంటిది అర్ధరాత్రి 12 గంటలకు రోడ్డుపై పరుగెత్తాల్సిన అవసరం ఏముంది. ఒకవేళ పోలీసులకు దొరికితే .. అతనికి పరీక్షలు చేసేవారు. దాని కన్నా ముందు అతని నుంచి అల్కహాల్ తీసుకుంటే వాసన వచ్చేది. దానిని నిర్ధారిస్తూ వైద్యుల చేత పరీక్షలు చేసి .. లోపలవెసేవారు. కానీ అలాంటి అవకాశం లేకుండా పారిపోయాడనే వాదన వినిపిస్తోంది.

ఒక్కరోజు పట్టిందా ..

ఒక్కరోజు పట్టిందా ..

సోమవారం అర్ధరాత్రి ఘటన జరిగితే ... మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు రాజ్ తరుణ్. ఏమీ గాయాలు కానీ రాజ్ తరుణ్ మీడియా ముందుకు రావడానికి .. జనాలకు థాంక్స్ చెప్పేందుకు ఒకరోజు పట్టిందా ? లేదా పోలీసుల విచారణను తప్పించుకోవడానికి వ్యుహాత్మకంగా వ్యవహరించడా అంటే ఔననే అనిపిస్తోంది. తనకు తాను కారు ఢీ కొని .. తానే పరుగెత్తడాన్ని ఎలా చూడాలి. పైగా తన ఆరోగ్యం గురించి పట్టించుకున్నందుకు .. ఆరాతీసిన వారికి థాంక్స్ అంటూ పోస్ట్ చేయడంతో కొందరు నెటిజన్లు కూడా స్పందించారు.

థాంక్స్ చెప్పడంతో ..

తన ప్రమాదం గురించి తెలియగానే స్పందించిన వారికి రాజ్ తరుణ్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. కానీ అందులో కొందరు నెటిజన్లు ప్రశలు వేశారు. కొందరు ఆరోగ్యం గురించి ఆరా తీస్తే మరికొందరు పరుగెత్తడం గురించి ప్రశ్నించారు. ఎందుకు పరుగెత్తారంటే .. భయపడ్డానని చెబితే .. విచారణ చేపట్టారు. మందు తాగి పరుగెత్తావా ? పోలీసులకు దొరికితే తాటా తీస్తారా అన్న శైలిలో ప్రశ్నలు వేశారు. దీంతో అభిమానుల నుంచి తప్పించుకోవడం తరుణ్ వల్ల కాలేదు. తాను బాధలో ఉంటే మీరేం ప్రశ్నలు వేస్తున్నారని పేర్కొన్నారు.

English summary
Recently, hero Raj Tarun's car crashed at Alkapuri Township on Outer Ring Road. Raj tarun .. He has three friends. The car balloon was open to all the survivors. Tarun's friends came out with wound. Raj ran immediately after the accident. Actually beyond 12.30 am midnight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X