టిఆర్ఎస్‌కు విజయరమణరావు షాక్: హమీ ఇచ్చినా కాంగ్రెస్‌లోకి, కారణమదేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

కరీంనగర్: పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు టిఆర్ఎస్‌లో చేరకుండా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారనే చర్చ సాగుతోంది. టిఆర్ఎస్‌ ముఖ్య నేతలు సీఎం కెసిఆర్ వద్దకు తీసుకెళ్ళి కూడ హమీలిచ్చినా... విజయరమణరావు మాత్రం ఈ హమీని పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సీఎం వద్దకు తీసుకెళ్ళిన టిఆర్ఎస్ నేతలకు విజయరమణరావకు షాకిచ్చారు.

రేవంత్‌కు ట్విస్ట్ ఇచ్చిన కంచర్ల: కోమటిరెడ్డే కారణమా, కారెక్కుతారా?

రేవంత్‌రెడ్డి వెంట కీలకమైన నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొన్నారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు విజయరమణరావు టిడిపిని వీడారు. 2009 ఎన్నికల్లో పెద్దపల్లి నుండి విజయరమణరావు ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. 2014లో ఆయన టిడిపి అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు.

రేవంత్ ఎపిసోడ్: టిటిడిపి నేతలతో రేపు బాబు మీటింగ్, సండ్రకు ఎల్పీనేతగా ఛాన్స్

చాలా కాలం నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరాలని విజయరమణరావుపై ఆ పార్టీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే ఆయన టిడిపిలోనే కొనసాగుతున్నారు. టిడిపిలో చోటుచేసుకొంటున్న పరిణామాలతో విజయరమణరావు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.

సీతక్క టిడిపికి ట్విస్ట్: రేవంత్ సతీమణి ప్లాన్, ఫోన్ స్విచ్ఛాప్ అందుకేనా?

 టిఆర్ఎస్‌కు విజయరమణరావు ఝలక్

టిఆర్ఎస్‌కు విజయరమణరావు ఝలక్

పెద్దపల్లి మాజీ శాసనసభ్యుడు, ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడు అయిన విజయరమణా రావు టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరడం ఊహించని పరిణామమే. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న విజయరమణారావును టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కానీ, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. కొందరు టిఆర్ఎస్ నేతలు విజయరమణారావును ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో సమావేశం ఏర్పాటు చేయించారని సమాచారం. టీఆర్‌ఎస్‌లో చేరితే ఎమ్మెల్యే కాకున్నా ఎమ్మెల్సీ అవకాశమైనా కల్పిస్తామని, తనపై భరోసా ఉంచి పార్టీలో చేరాలని సూచించగా విజయరమణారావు కొంత సమయం కావాల ని కోరారని సమాచారం. దరిమిలా టిఆర్ఎస్‌లో చేరడం కంటే కాంగ్రెస్ పార్టీని ఎంచుకొన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

 టిడిపి చొప్పదండి ఇంచార్జీగా ఇంతకాలం పాటు పనిచేసిన

టిడిపి చొప్పదండి ఇంచార్జీగా ఇంతకాలం పాటు పనిచేసిన

మేడిపల్లి సత్యం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికలకు ముందు సుద్దాల దేవయ్య టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన పోటీచేసి ఓటమిపాలయ్యారు.అయితే ప్రస్తుతం చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలో మేడిపల్లి సత్యం కూడ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టును 2019లో ఆశిస్తున్నారు. అయితే సుద్దాల దేవయ్య వయోబారాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ సత్యానికి టిక్కెట్టు కేటాయించే అవకాశాలు లేకపోలేదని సత్యం అనుచరులంటున్నారు. ఇంతకాలంగా పార్టీని నమ్ముకొన్న దేవయ్యను కాదని సత్యంకు టిక్కెట్టు కేటాయిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనే దేవయ్య వర్గీయులు కూడ పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

 కవ్వంపల్లికి ఏ టిక్కెట్టు కేటాయిస్తారు

కవ్వంపల్లికి ఏ టిక్కెట్టు కేటాయిస్తారు

కరీంనగర్ జిల్లా టిడిపి అధ్యక్షుడిగా ఇంతకాలం పాటు కొనసాగిన కవ్వం పల్లి సత్యనారాయణ రేవంత్‌తోపాటు కాంగ్రెస్‌లో చేరారు. ఆయన సొంత నియోజకవర్గమైన మానకొండూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పార్టీ విప్‌గా పనిచేసిన బలమైన నేత ఆరెపల్లి మోహన్‌ ఉన్నారు. మోహన్‌ను కాదని సత్యనారాయణకు అంత సులువుగా టికెట్‌ దక్కదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. . మోహన్‌ కూడా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తి లేదని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. మోహన్‌కు పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని కేటాయించి సత్యనా రాయణకు మానకొండూర్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తారనే వాదనను కూడా మోహన్‌ అంగీక రించడం లేదు.

 ఆ రెండు జిల్లాల్లోనే టిడిపి నేతలు

ఆ రెండు జిల్లాల్లోనే టిడిపి నేతలు

టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ జగిత్యాల జిల్లాకు చెందినవాడు. అయితే టిడిపి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అయిల్నేని సాగర్‌రావు, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు అన్నమనేని నర్సింగరావు మాత్రమే టీడీపీకి మిగిలారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణకు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు సాగర్‌రావు నమ్మి నబంటుగా ఉంటున్నందువల్ల ఆయన రమ ణను వీడి వెళ్లే అవకాశం లేదంటున్నారు.. అన్నమనేని నర్సింగరావు కూడ టిడిపిలోనే ఉండే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Trs leadership assured to Peddapalli former MLA Vijaya Ramana rao for nominate post.But Vijayaramanarao joined in Congress with Revanth Reddy on Tuesday at Delhi.He is intrest to contest from Peddapalli assembly segment in 2019 elections.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి