తెలంగాణలో 18 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌.. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్. రాగల 4 రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల చక్రవాత ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణలోని 18 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాగల నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేకాక పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతాయని స్పష్టం చేసింది.

ఈ మేరకు తెలంగాణలోని 18 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. అగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నట్లు స్పష్టత నిచ్చింది.

Widespread Rains Expected in Telangana for Next 4 Days IMD

ఇక హైదరాబాద్‌ లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం నుంచే వర్షం మొదలైంది. నిన్న రాత్రి, తెల్లవారు జామున కొన్ని జిల్లాల్లో వర్షం పడింది. ఈరోజు ఉదయం చిన్నగా ప్రారంభమైన వర్షం.. ఆ తర్వాత కొద్దిసేపటికి జోరందుకుంది. హైదరాబాద్ నగరవ్యాప్తంగా మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+