కానిస్టేబుల్ రాసలీలలు: రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకొని చితక్కొట్టిన భార్య
హైదరాబాద్: ప్రేమించి పెళ్ళి చేసుకొని ఇద్దరు పిల్లలున్న కానిస్టేబుల్ మరో మహిళతో రాసలీలలు సాగిస్తున్నాడు. భార్య, పిల్లలను పట్టించుకోకుండా మరో మహిళతో కలిసి ఉండగా భార్య రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకొంది. తన కాపురంలో చిచ్చు పెట్టిన మహిళను కానిస్టేబుల్ భార్య చితకబాదింది.
ప్రజలు తప్పు చేస్తే వారిని మంచి మార్గంలో నడిపించేందుకు ప్రయత్నాలు చేయాల్సిన కానిస్టేబుల్ చివరకు తప్పుడు మార్గంలో పయనించాడు. ప్రేమించి వివాహం చేసుకొన్న భార్యను, పిల్లల బాగోగులను చూసుకోవడం మానేశాడని భార్య ఆరోపిస్తోంది.
అంతేకాదు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే మరో మహిళతో ఉన్న విషయాన్ని గుర్తించిన భార్య భర్తను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొని చితక్కొట్టిన ఘటన చేర్యాలలో చోటుచేసుకొంది.

మరో మహిళతో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం
మహబూబాబాబాద్ జిల్లా మరిపెడబంగ్లా మండలం బావూజీగూడెంకు చెందిన యువకుడు ఓ యువతిని 2006లో ప్రేమించి వివాహం చేసుకొన్నాడు.వీరికి ఇద్దరు కూతుళ్ళు. 2011లో అతడికి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది.అయితే కొంతకాలం వరకు అతను భార్య, పిల్లలతో సంతోషంగానే ఉన్నాడు. ఆ తర్వాత భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్నాడ. అంతేకాదు చేర్యాలలో మరో మహిళతో కలిసి ఉంటున్నాడు.

రెఢ్‌హ్యండెడ్‌గా పట్టుబడిన కానిస్టేబుల్
మరో మహిళతో భర్త చేర్యాలలో కాపురం ఉంటున్న విషయం తెలుసుకొన్న బాధితురాలు తన కుటుంబసభ్యులతో చేర్యాలకు వచ్చింది. మరో మహిళతో భర్త రాసలీలల్లో మునిగి ఉండగానే ఆ ఇంట్లోకి వెళ్ళి భర్తతో పాటు, ఆ మహిళను చితకబాదింది. తనను కొట్టొదంటూ భర్త భార్య కాళ్ళపై పడి ప్రాధేయపడ్డాడు. అయినా కూడ బాధితురాలిలో ఆవేశం తగ్గలేదు.మహిళను, భర్తను చితకబాదింది.

హింసించారని కానిస్టేబుల్ భార్య తల్లిదండ్రుల ఆరోపణ
తమ కూతురిని ప్రేమించి వివాహం చేసుకొన్న కానిస్టేబుల్ చిత్రహింసలకు గురిచేశాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు. అయితే ఈ విషయం తెలుసుకొన్న స్థానిక పోలీసులు వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్ళి విచారిస్తున్నారు.

చర్యలు తీసుకోవాలని డిమాండ్
భార్య, పిల్లలను వదిలి పరాయి స్త్రీతో రాసలీలల్లో మునిగి తేలుతున్న కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తమ కూతురికి న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే బాధిత కుటుంబం పోలీసులకు చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications