దెయ్యం పట్టిందని నటించి.. భర్తను చితక్కొట్టిన భార్య (వీడియో)
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్ పంచాయతీలోని జంగాల కాలనీలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. తాగిన భర్తను తన భార్య దెయ్యం పట్టిందని చెబుతూ తీవ్రంగా కొట్టడంతో ఆ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. గంగారాం(51), లక్ష్మి(45) అనే ఈ దంపతులు గత 35 సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నారు. అయితే గంగారాం మద్యానికి బానిస కావడం వల్ల వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి.
రెండ్రోజుల క్రితం లక్ష్మి తనకు దెయ్యం పట్టిందంటూ పెద్దగా కేకలు వేయడం మొదలుపెట్టింది. ఆ సమయంలో గంగారాం నిద్రపోతున్నాడు. హఠాత్తుగా లక్ష్మి తన భర్తపై దాడికి దిగికి దిగింది. గంగారాం నోటిలో గుడ్డలు కుక్కి కర్రతో దారుణంగా కొట్టింది. ఊహించని ఈ దాడిలో గంగారాం తీవ్రంగా గాయపడ్డాడు. భార్య దాడిలో తీవ్రంగా గాయపడిన గంగారాం కేకలు వేస్తూ ఇంటి నుంచి బయటకు పరుగులు తీశాడు. అప్పటికే గంగారాం అరుపులు విని అక్కడికి వచ్చిన బంధువులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. బంధువులు ఎందుకు దాడి చేశావని లక్ష్మిని అడగగా.. తన దెయ్యం పట్టిందని విచిత్రంగా ప్రవర్తించింది.

అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత గంగారాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య కావాలనే తనపై దాడి చేసిందని, చిత్రహింసలకు గురిచేసిందని, ఇనుప రాడ్డుతో కొట్టిందని, నోటిలో గుడ్డలు కుక్కి చేతులు విరిచిందని గంగారాం ఫిర్యాదులో పేర్కొన్నాడు. గంగారాం ఫిర్యాదు మేరకు వీఎం బంజర్ పోలీసులు లక్ష్మిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఆస్పత్రిలో చికిత్స
దాడిలో గంగారాంకు పక్కటెముకలు విరగడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఖమ్మంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
దెయ్యం పట్టినట్టు నటిస్తూ భర్తను చితకబాదిన భార్య
— Telugu Scribe (@TeluguScribe) August 25, 2025
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్ గ్రామంలో గంగారం(51) అనే వ్యక్తిని దెయ్యం పట్టినట్టు నటించి చితకబాదిన భార్య
రోజు మద్యం తాగి వస్తున్నాడని నోట్లో గుడ్డలు కుక్కి, ఇనుప రాడ్లతో దాడి చేసిన భార్య
తీవ్ర గాయాలపాలైన భర్తను… pic.twitter.com/PluwXSyiol












Click it and Unblock the Notifications