హృదయ విదారక సంఘటన: లేవలేని భర్త కళ్లెదుటే భార్య ఆత్మహత్య

హైదరాబాద్: కిడ్నీ వ్యాధితో మంచం పట్టిన భర్త. బడికెళ్తున్న ఇద్దరు పిల్లలు, ముగ్గురికీ ఆమే ఆధారం. వంట మనిషిగా పని చేస్తే వచ్చే ఆదాయం ఇల్లు నడపడానికి, భర్త వైద్యానికి, పిల్లల చదువుకు.. సరిపోకపోవడంతో కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

బడి నుంచి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి తీసుకొచ్చిన తనకు పళ్లెంలో అన్నం పెట్టిన తల్లి, కళ్ల ముందే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని నిలువునా తగలబడిపోతుంటే చూస్తూ ఉండిపోయింది ఆ చిన్నారి. భార్య కళ్లముందే కాలిపోతుంటే కనీసం లేచి కాపాడలేని తన దుస్థితి తలచుకుని కుమిలిపోయాడు ఆ భర్త.

wife commits suicide in front of husband in hyderabad

ఈ హృదయ విదారక సంఘటన రాంనగర్‌లో చోటు చేసుకుంది. రాళ్లపల్లి వినోద్, శ్రీలక్ష్మీ(36) దంపతులు. వీరికి 2004 మే 9న వివాహం జరిగింది. రాంనగర్‌లోని మదర్స్ స్కూల్ దగ్గర నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సుశీల్‌ సూర్యం (9), సాయి నిఖిత (7).

వినోద్‌కు పుట్టుకతో ఒక కిడ్నీ మాత్రమే ఉంది. అతను ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. తాగుడుకు బానిస కావడంతో రెండు కిడ్నీలు పాడైపోయి... ఏడాది నుంచి మంచానికే పరిమితమయ్యాడు. దీంతో శ్రీలక్ష్మీ చుట్టుపక్కల ఇళ్లలో పనిచేసి కుటుంబాన్ని పోషిస్తోంది.

ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం.. కుమారుడు సుశీల్‌ సూర్యంను కీసర సమీపంలోని చీకటి మామిడి వేదపాఠశాల హాస్టల్‌లో చేర్పించింది. కానీ.. భర్తను 15 రోజులకోసారి డయాలసిస్‌ కోసం గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించుకోవడం, పాప స్కూలు ఫీజులు, ఇంటి అద్దె చెల్లించడం.. ఇన్ని భారాలను ఆమె మోయలేకపోయింది.

ఈ కష్టాలకు తోడు ఆర్థిక సమస్యల కారణంగా ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచూ వాగ్వాదం తలెత్తేది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన శ్రీలక్ష్మి సోమవారం మధ్యాహ్నం కుమార్తెను స్కూలు నుంచి ఇంటికి తీసుకువచ్చి అన్నం పెట్టింది. ఒంటిగంట సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది.

ఒళ్లంతా మంటలు చుట్టుముట్టగా బాధతో కేకలు పెడుతూ చనిపోయింది. కాగా, అభం శుభం తెలియని చిన్నారి అమ్మ కోసం వెక్కివెక్కి ఏడవడం అందరినీ కలిచి వేసింది. చుట్టుపక్కల వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+