పెద్ద భార్యతో 3 రోజులు, చిన్న భార్యతో 4 రోజులు: బండారం బయటపెట్టిన మొబైల్

హైదరాబాద్: మొదటి భార్యకు తెలియకుండానే మరో వివాహం చేసుకొని రెండో భార్యతో కాపురం చేస్తున్న వ్యక్తి బండారాన్ని మొబైల్‌ ఫోన్ బట్టబయలు చేసింది. తాను మోసపోయాయని తెలిసిన భార్య జూబ్లీహిల్స్ పోలీసులకు ఆశ్రయించింది. ఈ ఘటన హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది.

హైద్రాబాద్‌లోని రహమత్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవరన్ సతీష్ వివాహయ్యాక కూడ ఆ విషయాన్ని దాచి పెట్టి రెండో వివాహం చేసుకొన్నాడు. ఇద్దరు భార్యలతో వేర్వేరు ప్రాంతాల్లో కాపురం చేస్తున్నాడు.

ఒకరి వద్ద మూడు రోజులు, మరోకరి వద్ద మూడు రోజులు గడుపుతున్నాడు అయితే నిందితుడి మొబైల్ ఫోన్ ఈ రెండు పెళ్ళిళ్ళ గుట్టును రట్టు చేసింది. మోసపోయానని తెలిసిన తర్వాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

పేరు మార్చుకొని రెండో పెళ్ళి చేసుకొన్న ఆటో డ్రైవర్ సతీష్

పేరు మార్చుకొని రెండో పెళ్ళి చేసుకొన్న ఆటో డ్రైవర్ సతీష్

హైద్రాబాద్ రహమత్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ సతీష్ పేరు మార్చుకొని ఏడాది క్రితం వెంకటగిరికి చెందిన రేఖను వివాహం చేసుకొన్నాడు. తన పేరును సతీష్‌కు బదులుగా శివగా నమ్మించాడు. ప్రేమిస్తున్నానని చెప్పి రేఖను వివాహం చేసుకొన్నాడు. వెంకటగిరిలో రూమ్‌ను అద్దెకు తీసుకొని కాపురం పెట్టాడు.రేఖను వివాహం చేసుకోవడానికి ముందే సతీష్ కు వివాహమైంది. ఏడేళ్ళ క్రితమే జ్యోతి అనే మహిళను వివాహం చేసుకొన్నాడు. వారికి ఓ కొడుకు కూడ ఉన్నాడు. ఈ విషయాలను దాచి పెట్టి సతీష్ రేఖను వివాహం చేసుకొన్నాడు.

ఒకరికి తెలియకుండా మరోకరితో కాపురం

ఒకరికి తెలియకుండా మరోకరితో కాపురం

సతీష్ చాలా తెలివిగా వ్యవహరించాడు. మొదటి భార్యకు తెలియకుండా రెండో భార్యతో కాపురం చేశాడు. వారంలో మూడు రోజులు పెద్ద భార్య వద్ద ఉండేవాడు. మరో నాలుగు రోజులు చిన్న భార్య వద్ద ఉండేవాడు. వీరిద్దరికి కూడ అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకొన్నాడు. ఏడాదిగా ఇద్దరు భార్యలకు కూడ అనుమానం రాలేదు.

మొదటి పెళ్ళి బండారాన్ని బయటపెట్టిన మొబైల్

మొదటి పెళ్ళి బండారాన్ని బయటపెట్టిన మొబైల్

మొదటి పెళ్ళి బండారాన్ని సతీష్ మొబైల్ బయటపెట్టింది. రెండు రోజుల క్రితం సతీష్‌కు ఆమె చిన్న బార్య రేఖకు మధ్య గొడవలు జరిగాయి. భార్య, భార్యలిద్దరూ వాగ్వావాదానికి దిగారు. ఈ సమయంలో సతీష్ కోపంతో రేఖ ముఖంపై ఫోన్ విసిరి వెళ్ళిపోయాడు. అయితే ఆ ఫోన్‌లో జ్యోతి పేరుతో ఉన్న నెంబర్‌కు రేఖ ఫోన్ చేసింది. దీంతో జ్యోతితో రేఖ మాట్లాడింది. దీంతో అసలు విషయం రేఖకు తెలిసింది.

సతీష్‌పై కేసు పెట్టిన రేఖ

సతీష్‌పై కేసు పెట్టిన రేఖ

సతీష్‌ తనను మోసం చేసి రెండో వివాహం చేసుకొన్నాడని రేఖ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పేరు మార్చుకొని ఏడాది వరకు ఇద్దరు భార్యలకు అనుమానం రాకుండా ఉన్న సతీష్ బండారం బట్టబయలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+