హత్యల కలకలం : అక్కడ భార్య చేతిలో భర్త.. ఇక్కడ భర్త చేతిలో భార్య !!
సమాజం ఎటు దిశగా ప్రయాణిస్తోందో అర్థం కాని పరిస్థితులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒకవైపు వివాహేతర సంబంధాల పేరుతో కట్టుకున్న భార్యలను భర్తలే కడతేర్చుతున్న ఘటనలు వెలుగులోకి వస్తుండగా, మరోవైపు ప్రియుడి మోజులో పడో లేదా కుటుంబ కలహాల కారణాలతో భర్తలనే హత్య చేస్తున్న భార్యల ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వివాహం అనే పవిత్ర బంధం రక్తపాతంగా మారుతున్న ఈ ఘటనలు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రెండు వేర్వేరు హత్యలు కుటుంబ వ్యవస్థలో పెరుగుతున్న అనుమానం, అసహనం, సహనం లేమిని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఒక ఘటనలో భర్త వేధిస్తున్నాడనే కారణంతో భార్యే అతన్ని హత్య చేయగా, మరో ఘటనలో భార్యపై అనుమానంతో భర్త అత్యంత పాశవికంగా ఆమెను కడతేర్చాడు.

భర్తను చున్నీతో ఉరి వేసి చంపిన భార్య..
హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏపీ ఏలూరు జిల్లా నూజివీడు సమీపంలోని తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు సుధీర్‌రెడ్డి (44)కి అదే గ్రామానికి చెందిన బ్రహ్మజ్ఞానప్రసన్నతో వివాహమైంది. కొంతకాలంగా వీరిద్దరూ కూకట్‌పల్లిలోని వివేకానందనగర్‌లో నివాసం ఉంటున్నారు. సుధీర్‌రెడ్డి ప్రైవేట్ సంస్థలో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తుండగా, ప్రసన్న ఇంటి వద్దే ఉండేది.
ఇద్దరి మధ్య అనుమానాలు పెరగడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 23 రాత్రి భర్త మద్యం మత్తులో మంచం కోడుకు తగిలి మృతి చెందినట్లు భార్య బంధువులు, పొరుగువారిని నమ్మించింది. అయితే మృతుడి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల వచ్చిన పోస్టుమార్టం నివేదికలో ఇది హత్యగా తేలడంతో పోలీసులు ప్రసన్నను అదుపులోకి తీసుకుని విచారించారు. నిత్యం మద్యం తాగి వేధిస్తున్నాడని, ఆవేశంలో భర్త గొంతుకు చున్నీ బిగించి చంపినట్లు ఆమె అంగీకరించినట్టు కూకట్‌పల్లి సీఐ కె. వెంకట సుబ్బారావు తెలిపారు. నిందితురాలిని మంగళవారం కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు.

భార్యను రోకలిబండతో హత్య చేసిన భర్త..
ఇక మరో దారుణ ఘటన హైదరాబాద్ బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్‌గాంధీ నగర్‌లో చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన ఆంజనేయులు, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన సరస్వతి (34)లకు 2013లో వివాహమైంది. వీరికి 12 ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.
ఆంజనేయులు కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా, సరస్వతి హైటెక్ సిటీ పరిసరాల్లోని ఒక కంపెనీలో హౌస్‌కీపింగ్ సూపర్‌వైజర్‌గా పని చేసేది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, భర్త నిరుద్యోగం, భార్యపై పెరుగుతున్న అనుమానాలతో వీరి మధ్య తీవ్ర కలహాలు మొదలయ్యాయి. ఉద్యోగం మానేసిన ఆంజనేయులు జులాయిగా తిరగడం ప్రారంభించడంతో పరిస్థితి మరింత విషమమైంది. పిల్లలను కూడా బడికి పంపడం మాన్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిస్థితుల్లో సరస్వతి ఇటీవల పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. అయితే తాను మారిపోతానని, మంచిగా ఉంటానని భర్త నమ్మించి ఈ నెల 17న భార్య, పిల్లలను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని వచ్చిన సరస్వతి పిల్లలకు భోజనం పెట్టి నిద్రపోయింది. అదే సమయంలో ఆంజనేయులు నిద్రలో ఉన్న భార్య తలపై రోకలిబండతో పలుమార్లు దాడి చేసి హత్య చేశాడు.

పిల్లలు నిద్రలేవగానే 'అమ్మ పడుకుంది, మీరు కూడా నిద్రపోండి' అంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి పిల్లలు లైట్ వేసి చూసేసరికి తల్లి రక్తపుమడుగులో పడి ఉండటాన్ని గమనించి సమీపంలో ఉన్న మేనమామకు సమాచారం అందించారు. ఆయన పోలీసులకు ఫోన్ చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
మొబైల్ స్టేటస్‌లో హత్య అంగీకారం..
ఈ ఘటనలో మరింత షాకింగ్ విషయం ఏమిటంటే, భార్యను హత్య చేసిన అనంతరం ఆంజనేయులు తన మొబైల్‌లో "నా జీవితంలో సగభాగమైన నిన్ను నా చేతులారా చంపుకున్నాను" అంటూ స్టేటస్ పెట్టుకోవడం. గతంలో సరస్వతి సోదరుడిపై కత్తితో దాడి చేసిన కేసు కూడా ఆంజనేయులుపై నమోదైనట్లు సమాచారం. సరస్వతి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.
కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు..
వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ హత్యలు కుటుంబ బంధాల్లో పెరుగుతున్న అనుమానం, మానసిక ఒత్తిడి, సహనం లోపాన్ని ప్రతిబింబిస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోలేక, చివరికి ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరడం సమాజానికి తీవ్ర హెచ్చరికగా మారుతోంది. కుటుంబ కలహాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంత ముఖ్యమో ఈ ఘటనలు మరోసారి గుర్తుచేస్తున్నాయి.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications