నా భర్తను చంపెయ్: సెలవు పెట్టి మరీ ప్రియురాలి కోరిక తీర్చాడు

తన భర్తను చంపేయాలని ప్రియురాలు మొరపెట్టుకోగా, ప్రియుడు ఆ పని చేసిన సంఘటన హైదరాబాదులోని బూర్గులలో చోటు చేసుకుంది. ఈ సంఘటన కొద్ది రోజుల క్రితం జరిగింది.

హైదరాబాద్: తన భర్తను చంపేయాలని ప్రియురాలు మొరపెట్టుకోగా, ప్రియుడు ఆ పని చేసిన సంఘటన హైదరాబాదులోని బూర్గులలో చోటు చేసుకుంది. ఈ సంఘటన కొద్ది రోజుల క్రితం జరిగింది. తాజగా, భర్త హత్యలో భార్య, ఆమె ప్రియుడిని నిందితులుగా గుర్తించి, అరెస్ట్ చేశారు.

ఆంజనేయులు(35) అనే వ్య‌క్తి రోజూ తాగి వ‌చ్చి త‌న భార్య లక్ష్మిని హింసించేవాడు. లక్ష్మికి ఆంజనేయులుకు తమ్ముడు వరసైన హనుమంతుతో వివాహేత‌ర సంబంధం ఉంది. హ‌నుమంతు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. ల‌క్ష్మిని ఆయ‌న పదేప‌దే క‌లిసేవాడు.

Wife and lover kills man in Hyderabad

తన భర్త రోజు తాగి వచ్చి కొడుతున్నాడని, హింసిస్తున్నాడని, ఆయనను చంపేయాలని లక్ష్మి ఓసారి ప్రియుడు హనుమంతును అడిగింది. దీంతో ఆంజనేయులును బ‌య‌ట‌కు తీసుకెళ్లిన హనుమంతు బూర్గుల శివార్లలో మద్యం తాగించాడు.

అక్కడ ఆంజనేయులు గొంతుకు తువ్వాలు బిగించి చంపేశాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితులు లక్ష్మి, హనుమంతులను అరెస్టు చేశారు.

ఆంజనేయులు జూన్ 14వ తేదీన హత్యకు గురయ్యాడు. అతనిని చంపేందుకు హనుమంతు సెలవు పెట్టి మరీ అంతకుముందు రోజే హైదరాబాద్ వచ్చాడు.

మొదట ఇంట్లోనే చంపాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇంట్లో పిల్లలు ఉంటారని లక్ష్మీ చెప్పడంతో ప్లాన్ మార్చాడు. మద్యం తాగుదాం రమ్మని పిలిచి, ఆ తర్వాత హత్య చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+