ట్విస్ట్: కొడుకు గుర్తుగా కారును చూసుకొంటాం, పోలీసులకు అందుబాటులోకి రాని వనితా
హైదరాబాద్: తెలుగు సినీ నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకొన్నారు. చనిపోయే ముందు సెల్పీ వీడియో రికార్డ్ చేశారు విజయ్. ఈ వీడియో ఆధారంగా విచారణ జరిపించాలని విజయ్ సాయి తండ్రి సుబ్బారావు మరోసారి డిమాండ్ చేశారు. ఈ వీడియో ఆధారంగా ఈ ముగ్గురికి పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం కన్పిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ సాయి భార్య వనితారెడ్డి పోలీసులకు అందుబాటులోకి రాలేదని సమాచారం.
Recommended Video

రెండు రోజుల క్రితం ఇంట్లోనే విజయ్ సాయి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరేసుకొనే ముందు విజయ్ సాయి సెల్పీ వీడియో రికార్డు చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే విజయ్ సాయి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. విజయ్ సాయి చేసిన ఆరోపణలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే అదే సమయంలో వనితా రెడ్డి కూడ విజయ్‌పై, ఆయన తండ్రిపై కూడ ఆరోపణలు చేసింది.

వనితాతో పాటు మరో ఇద్దరికి నోటీసులు ఇవ్వనున్న పోలీసులు
చనిపోయే ముందు సినీ నటుడు విజయ్ సాయి సెల్పీ వీడియో రికార్డ్ చేశారు. తన ఆత్మహత్యకు తన భార్య వనితారెడ్డి, కాంట్రాక్టర్ శశిధర్, అడ్వకేట్ శ్రీనివాస్‌లపై ఆరోపణలు చేశారు.ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు గాను నోటీసులు ఇవ్వనున్నారు. అసలు విజయ్ వీరిపై ఎందుకు ఆరోపణలు చేయాల్సి వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీయనున్నారు.ఈ మేరకు ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

.వనితారెడ్డిపై రెండు కేసులు
విజయ్ సాయి ఆత్మహత్య కేసు విషయమై వనితారెడ్డిని పోలీసులు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఆమె మాత్రం అందుబాటులోకి రాలేదని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. విజయ్ సాయి చనిపోయే ముందు ఆమెపై ఎందుకు ఈ తరహ ఆరోపణలు చేశారనే విషయమై పోలీసులు ప్రశ్నించే అవకాశం కూడ లేకపోలేదు. ఈ విషయమై ప్రశ్నించాలని భావిస్తున్న సమయంలో ఆమె అందుబాటులోకి రాకపోవడం అనుమానాలకు తావిస్తోందని విజయ్ కుటుంబసభ్యులు అభిప్రాయపడుతున్నారు.విజయ్ ఇంటికి నలుగురితో వచ్చి బలవంతంగా వచ్చి వనితారెడ్డి కారు తీసుకెళ్లిందన్నది ఓ కేసైతే, విజయ్ ఆత్మహత్యకు కారణమంటూ వనితారెడ్డిపై మరో కేసు నమోదు అయింది.

కొడుకు గుర్తుగా కారును చూసుకొంటాం
విజయ్ సాయి కారును తిరిగి ఇప్పించాలని విజయ్ తండ్రి సుబ్బారావు పోలీసులను కోరారు. విజయ్ సాయి ఆత్మహత్య కేసులో విజయ్ తల్లిదండ్రులను పోలీసులు బుదవారం నాడు సమాచారం సేకరించారు.తమ కొడుకు గుర్తుగా కారును ఇప్పించాలని సుబ్బారావు పోలీసులను కోరారు. కారు వనితారెడ్డి పేరున ఉన్నా... కారు కొనుగోలు చేసేందుకు విజయ్ డబ్బులు చెల్లించాడని వారు గుర్తు చేశారు.

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపిన పోలీసులు
ఆత్మహత్య చేసుకొనే ముందు విజయ్ సాయి రికార్డ్ చేసిన సెల్పీ వీడియోను పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపారు. ఈ ల్యాబోరేటరీ ఇచ్చే నివేదిక కేసు విచారణకు దోహదపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. విజయ్ ఆరోపణలు చేసిన వారిని ప్రశ్నిస్తే కూడ ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం కూడ లేకపోలేదు.అన్ని రకాల కోణాల్లో ఈ కేసు విచారణ చేస్తున్నారు.
-
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
వెంకీ- కల్యాణ్ రామ్- అనిల్ రావిపూడి: ఇంకో బ్లాక్ బస్టర్ రెడీ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications